ETV Bharat / bharat

ఊరంతా వృద్ధులున్నా.. కరోనా అడుగుపెట్టలేదు - కొవిడ్​ కేసులు

కరోనా.. మారుమూల గ్రామాల నుంచి పెద్ద పెద్ద పట్టణాలనూ చుట్టేసింది. అయితే కొన్ని ఊళ్లు ఇప్పటికీ కరోనా రహితంగా ఉన్నాయి. స్వీయ నియంత్రణ, కరోనా నిబంధలను పటిష్ఠంగా అమలు చేయటం వల్లా ఆ ఊళ్లలోకి వైరస్​ ప్రవేశించలేకపోయింది. అలాంటిదే గుజరాత్​ మెహ్సానా జిల్లాలోని చాందని గ్రామం. ఆ ఊరి నిండా వృద్ధులే ఉండటం గమనార్హం.

corona free village
కరోనా రహిత గ్రామం
author img

By

Published : May 8, 2021, 5:17 PM IST

గుజరాత్​లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మరోవైపు.. పలు గ్రామాల ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలు చేపట్టి వైరస్​ను తమ ఊరిలోకి ప్రవేశించకుండా నిలువరిస్తున్నారు. అలాంటి కోవకే చెందుతుంది మెహ్సానా జిల్లా బేచరాజీ తాలుకాలోని చాందని గ్రామం. ఇప్పటికీ ఆ గ్రామం కరోనా రహితంగా ఉంది. ఆ ఊరిలో దాదాపు మొత్తం యువకులు ఉపాధి నిమిత్తం గల్ఫ్​ దేశాలకు వెళ్లగా.. ఎక్కువ శాతం వృద్ధులే ఉండటం మరో విశేషం.

corona free village
నిర్మానుష్యంగా గ్రామం

స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష!

ఆ గ్రామంలో 70-100 మంది వృద్ధులు ఉంటారు. కరోనా రెండో దశ విజృంభణలోనూ ఆ ఊరిలో ఒక్కటంటే ఒక్క కేసు నమోదు కాకపోవటం చాలా గొప్ప విషయమనే చెప్పాలి. స్వీయ క్రమశిక్షణతో కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్​ను తమ ఊరిలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు గ్రామస్థులు. వారు గ్రామం నుంచి బయటకు వెళ్లరు, బయటి వారిని ఊరిలోకి రానివ్వరు. అందరూ మాస్క్​ ధరిస్తారు, శానిటైజ్​ చేసుకుంటారు, భౌతికదూరం పాటిస్తారు. ప్రధానంగా అందరూ హోంక్వారంటైన్​లోనే ఎక్కువగా ఉంటారు.

corona free village
మాస్క్​లు ధరించి, భౌతికదూరంలో వృద్ధులు
corona free village
ఇంట్లోనూ మాస్క్​ ధరించిన వృద్ధురాలు

ఏ ఒక్కరు అనారోగ్యానికి గురికాలేదు

ఆ గ్రామంలోని వృద్ధులంతా టీకా రెండు డోసులు తీసుకున్నారు. ఊరిలోని ఏ ఒక్క వ్యక్తికి జ్వరం, దగ్గు, జలుబు వంటి అనారోగ్య లక్షణాలు లేవు. ఒకవేళ ఎవరైనా అస్వస్థతకు గురైతే.. పూనమ్​ భాయ్​ అనే వ్యక్తి తన వాహనంలోనే బేచరాజి నగరానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు.

corona free village
ప్రశాంతంగా గ్రామం

వృద్ధులే అధికంగా ఉన్నా..జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాని ఏకైక గ్రామంగా చాదంకి నిలిచింది.

ఇదీ చూడండి: కరోనా కట్టడికి రాష్ట్రాల 'లాక్​డౌన్' అస్త్రం

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.