ETV Bharat / bharat

పుదుచ్చేరి కొత్త ఎల్​జీగా మాజీ ఐపీఎస్​! - UPSC member Bhim Sain Bassi

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​గా ఐపీఎస్ అధికారి భీమ్ సైన్ బస్సీని నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​ పదవికి సైతం ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

B.S. Bassi's
భీమ్ సైన్ బస్సీ
author img

By

Published : Feb 25, 2021, 1:16 PM IST

దిల్లీ పోలీస్ విభాగం మాజీ కమిషనర్ భీమ్ సైన్ బస్సీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​గా నియమించాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం యూపీఎస్​సీలో సేవలందిస్తున్న ఆయన పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. పదవీ విరమణ తర్వాత ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ఈ అంశంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​గా ఉన్న అనిల్ బైజాల్ స్థానంలో బస్సీని నియమించే అంశాన్నీ కేంద్రం పరిశీలిస్తోందని తెలిపారు అధికారులు. అయితే ఇప్పటివరకు ఏ విషయం ఖరారు కాలేదని చెప్పారు. ప్రస్తుతం దిల్లీ పోలీస్ కమిషనర్​గా ఉన్న ఎస్ఎన్ శ్రీవాస్తవతో బస్సీకి సత్సంబంధాలు లేవని ఉన్నతాధికారులు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

కిరణ్ బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగించిన తర్వాత.. ఆ స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు.

కేజ్రీ సర్కార్​తో విభేదాలు

1977 ఐపీఎస్ బ్యాచ్​కు చెందిన బస్సీ అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-కేంద్రపాలిత ప్రాంతాల(ఏజీఎంయూటీ) కేడర్​కు ఎంపికయ్యారు. దిల్లీ పోలీస్​ కమిషనర్​గా 2013 ఆగస్టు నుంచి 2016 ఫిబ్రవరి వరకు సేవలందించారు. కేజ్రీవాల్ ప్రభుత్వంతో విభేదాలు ఎదురయ్యాయి. దేశద్రోహం కేసులో జేఎన్​యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్​ అరెస్టు విషయంలో బస్సీ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్​తో 'పెట్రో బాదుడు'పై మమత నిరసన

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.