- గత జనవరిలో జరిగిన ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు ఎంత ఖర్చు చేశాయి విషయాలను ఎన్నికల సంఘం వెల్లడించింది.
- ఈ మేరకు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ చేసిన ఎన్నికల వ్యయాలను ఎన్నికల సంఘం తమ పోర్టల్లో అందుబాటులో ఉంచింది.
- ప్రచారం, తదితర ఖర్చుల వివరాలతో కూడిన నివేదికల్ని ఈ పార్టీలు తయారు చేసుకున్నాయి.
- నిబంధనల ప్రకారం ఈ నివేదికల్ని ఎన్నికల సంఘానికి సమర్పించాయి భాజపా, కాంగ్రెస్.
- ఇందులో అత్యధికంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భాజపా రూ.340 కోట్లు ఖర్చు చేసింది.
- అదే రాష్ట్రాల్లో కాంగ్రెస్ రూ.190 కోట్లు ఖర్చు చేసింది.
- ఉత్తర్ప్రదేశ్, మణిపుర్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం కోసం భాజపా మొత్తంగా రూ.340 కోట్లు ఖర్చుచేసింది.
- ఉత్తర్ప్రదేశ్లో రూ.221 కోట్లు, మణిపుర్లో రూ.23 కోట్లు, ఉత్తరాఖండ్లో రూ.46.67 కోట్లు, గోవాలో రూ.19 కోట్లు, పంజాబ్లో రూ.36 కోట్లకు పైగా తమ ప్రచారం కోసం ఖర్చు చేసినట్లు భాజపా తన ఎన్నికల వ్యయం నివేదికలో పేర్కొంది.
- అవే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, దానికి సంబంధించిన పనులకు రూ.194 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ తెలిపింది.
- అయితే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో, పోటీ చేసే పార్టీలు కచ్చితంగా.. నిర్దేశించిన కాలపరిమితిని అనుసరించి తమ ఎన్నికల వ్యయాల నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించాలి.
ఇవీ చదవండి: నెల్లూరు, నిజామాబాద్లోనూ PFI కలకలం.. ఎందుకీ దాడులు? అమిత్ షా లెక్కేంటి?
చారిత్రక ఎన్నికకు రంగం సిద్ధం.. కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎవరిదో?