ETV Bharat / bharat

సామాజిక దూరం వద్దు.. భౌతిక దూరం ముద్దు

author img

By

Published : Sep 15, 2020, 1:13 PM IST

కరోనా జాగ్రత్తల్లో 'సామాజిక దూరం' అనే పదంపై రాజ్యసభ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల బాధితులు సామాజిక వివక్షకు గురవుతున్నారని, దానికి బదులుగా 'భౌతిక దూరం' అనే పదం వినియోగించాలని సూచించారు. ఈ అంశాన్ని అంగీకరించిన ఛైర్మన్​ వెంకయ్యనాయుడు.. 'సురక్షిత దూరం' అనే పదాన్ని సిఫార్సు చేశారు.

RS-SOCIAL DISTANCING
ఛైర్మన్​ వెంకయ్యనాయుడు

కరోనా నుంచి రక్షణకు 'సామాజిక దూరం' పాటించాలని నిపుణులు, ప్రభుత్వాలు సూచించాయి. అయితే, ఈ పదం వల్ల కరోనా రోగులు, వారి కుటుంబాలు సామాజిక వివక్షకు గురవుతున్నాయని రాజ్యసభ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

దానికి బదులుగా 'భౌతిక దూరం' అనే పదాన్ని ఉపయోగించాలని డిమాండ్ చేశారు. సభ్యుల సూచనను అంగీకరించిన ఛైర్మన్​ వెంకయ్యనాయుడు.. సరైన పదాన్ని వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. 'సురక్షిత దూరం' అనే పదాన్ని సూచించారు వెంకయ్య.

రాజ్యసభ సమావేశాల్లో భాగంగా తృణమూల్​ కాంగ్రెస్ నేత శాంతను సేన్​ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆయనకు చాలా మంది సభ్యులు మద్దతు తెలిపారు.

ఇదీ చూడండి: భారత్​లో 49 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.