ETV Bharat / bharat

పేపర్-పెన్ మోడ్​లోనే NEET UG 2025- ఒకే రోజు ఒకే షిఫ్ట్​లోనే పరీక్ష - NEET UG 2025

ఎన్‌టీఏ కీలక ప్రకటన- ఓఎంఆర్‌ పద్ధతిలో నీట్‌ యూజీ 2025 పరీక్ష

NEET UG 2025 Exam Mode
NEET UG 2025 Exam Mode (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2025, 7:01 PM IST

NEET UG 2025 Exam Mode : దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ యూజీ పరీక్షల నిర్వహణ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను పెన్, పేపర్ పద్ధతి(ఓఎంఆర్ విధానం)లోనే నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ ఏడాది ఒకే రోజులో, ఒకే షిఫ్టులో నీట్ పరీక్ష జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) అధికార వర్గాలు గురువారం స్పష్టం చేశాయి.

నీట్ యూజీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలా ? పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహించాలా ? అనే దానిపై కేంద్ర విద్యాశాఖ, ఆరోగ్యశాఖ సమగ్రంగా చర్చించకున్నట్లు ఎన్​టీఏ తెలిపింది. ఆ తర్వాతే ఈ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. 'జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తీసుకున్న నిర్ణయం ప్రకారం, నీట్-యూజీ పరీక్షను పెన్, పేపర్ పద్ధతిలోనే ఈసారి నిర్వస్తాం. ఒకే రోజులో, ఒకే షిఫ్టులో పరీక్ష ఉంటుంది' అని ఎన్‌టీఏ అధికార వర్గాలు చెప్పాయి.

గతేడాది నీట్ యూజీ పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారాలు జరగడం కలకలం రేపింది. అప్పట్లో ఆన్‌లైన్‌లోనే పరీక్ష జరిగింది. ఇక నుంచి అలాంటి ఘటనలకు తావివ్వకూడదనే పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకే పెన్, పేపర్ పద్ధతిలో నీట్ పరీక్ష నిర్వహణకు సిద్ధమైంది.

యూజీసీ నెట్ పరీక్షలోనూ
పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'యూజీసీ- నెట్' పరీక్షలోనూ గతేడాది పేపర్ లీక్ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వెంటనే ఆ పరీక్షను రద్దు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్‌టీఏ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల్లో పారదర్శకతను పెంచేందుకు అనుసరించాల్సిన అంశాలపై అధ్యయనానికి ఒక అత్యున్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి సారథిగా ఇస్రో మాజీ చీఫ్ ఆర్ రాధాకృష్ణన్​ను నియమించారు. ఆ కమిటీ సిపార్సులు ఆధారంగానే ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ పరీక్షను నిర్వహించనున్నారు.

దేశంలోనే అతిపెద్ద పరీక్ష
దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్‌కు పేరుంది. 2024లో ఏకంగా 24 లక్షల మందికిపైగా ఈ పరీక్షను రాశారు. దేశవ్యాప్తంగా వైద్యకళాశాలల్లోని దాదాపు 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కోసం ఏటా నీట్ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహిస్తుంటుంది. మొత్తం 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్లలో దాదాపు 56వేల సీట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉన్నాయి. నీట్‌లో సాధించే మార్కుల ఆధారంగా విద్యార్థులకు వివిధ కోర్సుల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.