ETV Bharat / bharat

ఐసీయూలో ఆరోగ్య మంత్రి- పరిస్థితి విషమం

author img

By

Published : Jun 19, 2020, 3:17 PM IST

Updated : Jun 19, 2020, 4:04 PM IST

delhi health minister on ventilator
ఐసీయూలో ఆరోగ్య మంత్రి

15:33 June 19

దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గటం వల్ల ఐసీయూకు తరలించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈనెల 17న దిల్లీ వైద్య శాఖ మంత్రి జైన్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. అయితే ఆ మరుసటిరోజు తీవ్రమైన జ్వరం, ఆక్సిజన్ స్థాయిలు దారుణంగా పడిపోవటం వల్ల రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. 

ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు ప్రకటించిన మరుసటిరోజే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ పెరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు దిల్లీ వైద్య శాఖ మంత్రి కార్యాలయం ఓ ప్రకటన చేసింది. ప్రత్యేక వైద్యుల బృందం.. జైన్‌ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.

సత్యేంద్ర జైన్​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

15:12 June 19

కరోనాతో వెంటిలేటర్​పై ఆరోగ్య మంత్రి

కరోనా సోకి ఇటీవల ఆసుపత్రిలో చేరిన దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్​ ఆరోగ్యం క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​ పెరగడం వల్ల ప్రస్తుతం కృత్రిమ శ్వాస అందిస్తున్నారు వైద్యులు.

Last Updated : Jun 19, 2020, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.