కర్రలు, బెల్టులతో విద్యార్థిని చితకబాదిన దుండగులు - ఉత్తర్ప్రదేశ్ లో విద్యార్థిని కొట్టిన దుండగులు
🎬 Watch Now: Feature Video
కొందరు దుండగులు కలిసి ఓ విద్యార్థిని దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ గోండా జిల్లాలోని మన్కాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాలిబన్ల రీతిలో చితకబాదినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. కర్రలు, చెప్పులు, బెల్టులతో చిత్రహింస చేశారు. విడిచిపెట్టమని ఎంత వేడుకున్నా.. కనికరించలేదు. చివరికి ప్రాణాపాయ స్థితిలో వదిలివెళ్లారు. దుండగులు విద్యార్థిని ఎందుకు కొట్టారో కారణాలు ఇంతవరకు తెలియలేదు. ఈ వీడియో ఆధారంగా దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆ జిల్లా ఎస్పీ తెలిపారు.