బురద నీటిలో యోగా, స్నానం.. రోడ్ల దుస్థితిపై వెరైటీ నిరసన.. ఎమ్మెల్యే షాక్! - kerala potholes news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16065479-thumbnail-3x2-road.jpeg)
రోడ్డుపై గుంతల్లో నిలిచిన బురద నీటిలో ఓ యువకుడు యోగాసనాలు వేయడం, స్నానం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపేందుకు కేరళ మలప్పురానికి చెందిన హంస పొర్లి.. పండిక్కడ్లో ఇలా చేశాడు. రోడ్డుపై నిలిచిన బురద నీటితో దుస్తులు ఉతికాడు. అక్కడే యోగా, స్నానం చేశాడు. అదే మార్గంలో వెళ్తున్న మంజేరి ఎమ్మెల్యే లతీఫ్.. ఈ యువకుడిని గమనించారు. ఆగి అతడితో మాట్లాడారు. తన నియోజకవర్గంలోని రోడ్లను సత్వరమే బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు.