ఇంట్లోకి దూరి కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత.. భయంభయంగా జనం!
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15492134-thumbnail-3x2-leopard.jpg)
Leopard Attacks Pet Dog: ఓ ఇంట్లోకి దూరిన చిరుత.. పెంపుడు కుక్కను నోటకరుచుకు వెళ్లిన ఘటన మహారాష్ట్ర నాశిక్‌లో జరిగింది. సీసీటీవీలో నమోదైన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ముంగ్సారే ఆదివారం అర్ధరాత్రి.. ఓ ఇంటిబయట గోడపై పడుకుంది శునకం. అక్కడే మాటువేసి ఉన్న ఓ చిరుత.. వేటాడి కుక్కను పట్టుకెళ్లింది. గ్రామంలో చిరుత సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. రాత్రి పూట జనం అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు అటవీ అధికారులు.
Last Updated : Jun 7, 2022, 11:14 AM IST