ETV Bharat / business

పర్సనల్ లోన్ కావాలా? ఆన్​లైన్​లో అప్లై చేయాలంటే ఈ 6 డాక్యుమెంట్స్ మస్ట్​! - PERSONAL LOAN DOCUMENTS

వ్యక్తిగత రుణానికి కావాల్సిన 6 కీలక డాక్యుమెంట్లు ఇవే- వేతన రసీదులు, పాన్, ఆధార్​ రెడీ చేసుకోవాల్సిందే!

Personal Loan
Personal Loan (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2025, 3:27 PM IST

Personal Loan Documents : మీకు అర్జెంట్​గా వ్యక్తిగత రుణం కావాలా? అయితే ఇది మీ కోసమే. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లు (ఎన్​బీఎఫ్​సీ), డిజిటల్ ఫిన్‌టెక్ వేదికల నుంచి మన వ్యక్తిగత అవసరాల కోసం రుణాలను తీసుకోవచ్చు. చాలా బ్యాంకులు ఇప్పటికీ ఆఫ్‌లైన్‌(ప్రత్యక్ష) పద్ధతిలోనే రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో రుణాన్ని పొందడమే సులభమైన పద్ధతి. కనుక వీలైనంత వరకు ఆన్‌లైన్‌లో రుణ దరఖాస్తును సమర్పించడమే మేలు. రుణ దరఖాస్తులో మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేశాక, ఫోన్‌‌కు ఓటీపీ వస్తుంది. ఈ విధంగా ఆథెంటికేషన్ పూర్తయ్యాక, ఇతరత్రా ముఖ్యమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గత మూడు నెలల వేతన రసీదులు (శాలరీ స్లిప్స్), పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఉద్యోగ ఐడీ కార్డ్, పూచీకత్తు ఇచ్చే వ్యక్తి ఫోన్ నంబరు వంటి సమాచారాన్ని ఇవ్వాలి. ఈ క్రమంలో ఆధార్ నంబరుతో అనుసంధానితమై ఉన్న ఫోన్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి ఆధార్ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

వ్యక్తిగత రుణం కోసం కావాల్సిన కీలక పత్రాలివే!

  1. వేతన రసీదులు : బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీ ఆదాయ వనరుల సమాచారాన్ని అధికారికంగా ధ్రువీకరించుకోవడానికి వేతన రసీదులను పరిశీలిస్తాయి. సాధారణంగా గత మూడు నెలల వేతన రసీదులను సమర్పించాలి. కొన్నిసార్లు ఆరు నెలల వేతన రసీదులను సమర్పించమని అడుగుతారు. నెలవారీగా వచ్చే వేతనం ఆధారంగా దరఖాస్తుదారుడి ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ప్రతినెలా ఖర్చులుపోను చేతిలో ఎంత మిగులుతుందనే అంచనాకు వస్తారు. ఈ ప్రాతిపదికనే రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు.
  2. పాన్ కార్డు : ప్రతి ఆదాయపు పన్ను సంబంధిత లావాదేవీకి కీలకమైన పత్రం పాన్ కార్డు. దీన్ని తప్పనిసరిగా సమర్పించాలి.
  3. ఆధార్ కార్డు : ఆధార్ కార్డులో 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఇది చిరునామాగా, గుర్తింపు రుజువు పత్రంగా పనిచేస్తుంది.
  4. ఉపాధి రుజువు పత్రాలు : దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఉద్యోగానికి సంబంధించిన ఐడీ కార్డ్‌ను సమర్పించాలి. కొన్ని బ్యాంకులు అపాయింట్‌మెంట్ లెటర్‌ను కూడా సమర్పించమని అడుగుతుంటాయి.
  5. లేటెస్ట్ అప్రైజల్ లెటర్ : ఒకవేళ అపాయింట్‌మెంట్ లెటర్‌లో చూపిన దానికంటే మీ ప్రస్తుత వేతనం ఎక్కువగా ఉంటే తాజా అప్రైజల్ లెటర్‌ను సమర్పించమని బ్యాంకు అడుగుతుంది. ఆ లెటర్ ఆధారంగానే వేతన రసీదులపై ఉన్న ఆదాయ సమాచారాన్ని బ్యాంకు ధ్రువీకరించుకుంటుంది.
  6. గ్యారెంటర్ : వ్యక్తిగత రుణం అనేది పూచీకత్తు అవసరం లేని అసురక్షిత రుణం. అయినప్పటికీ బ్యాంకు మిమ్మల్ని పూచీకత్తు అడిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు పూచీకత్తుగా ఉండే వ్యక్తి పేరు, ఫోన్ నంబరు వంటి సమాచారాన్ని ఇవ్వాలి. ఒకవేళ రుణం తీసుకున్న వ్యక్తి సకాలంలో తిరిగి చెల్లించకుంటే పూచీకత్తు ఇచ్చిన వ్యక్తిని బ్యాంకు ప్రతినిధులు సంప్రదిస్తారు.

అర్జెంట్​గా రూ.3 లక్షలు పర్సనల్ లోన్​ కావాలా? మీ శాలరీ ఇంత ఉంటే చాలు!

మీ క్రెడిట్ స్కోర్​ 600 కంటే తక్కువగా ఉందా? డోంట్ వర్రీ - ఇలా చేస్తే లోన్ గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.