AAP MLAS Resigned : దిల్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. 5 రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఎనిమిది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. వారికి ఈసారి ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడం వల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. అయితే ఎమ్మెల్యేల రాజీనామాపై ఆప్ ఇంకా స్పందించలేదు.
రాజీనామా చేసిన వారి వివరాలు ఇవే :
- భావ్నా గౌడ్- పాలం
- బీఎస్.జూన్ - బిజవాసన్
- పవన్ శర్మ - ఆదర్శ నగర్
- మదన్ లాల్ - కస్తూరబా నగర్
- రాజేశ్ రుషి - జనక్‌పురి
- రోహిత్ మెహరౌలియా - త్రిలోకపురి
- నరేశ్ యాదవ్ - మహరౌలి
- గిరీశ్ సోని -మాదీపూర్
Aam Aadmi Party MLA from Trilokpuri Rohit Mehraulia, MLA from Kasturba Nagar Madan Lal, MLA from Janakpuri Rajesh Rishi, MLA from Palam Bhavna Gaur resigned from the party
— ANI (@ANI) January 31, 2025
The party did not give tickets to them this time.#DelhiElection2025 pic.twitter.com/tlrl2tdmNx