Tractor Accident In Khammam : ఒకేరోజు జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా రెండు ఘటనల్లో అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపించారు.
కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి గోయలో పడటంతో ఆ మహిళ మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా బోనకల్లు సమీపంలో 20 మంది మహిళలంతా కలిసి ట్రాక్టర్లో కూలీకి వెళ్తున్నారు. మార్గం మధ్యలో ట్రాక్టర్ అదుపు తప్పి లోయలో పడింది. చుట్టుపక్కల ఉన్నవారంతా వచ్చి వారందరికి బయటకు తీశారు. ఘటనలో స్థానికంగా ఉండే యార్లగడ్డ వరమ్మ(60) అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది మహిళలు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషయమంగా ఉంది. వారందరిని అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొన్న బైక్ - ముగ్గురు మైనర్లు మృతి
RTC Bus Road Accident in Rajanna Sircilla : మరో ఘటనలో కిక్కిరిసిన జనంతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెళ్తున్న రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివారులో కామారెడ్డి డిపోనకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు సిరిసిల్లకు వస్తుంది. గోరంటాల బ్రిడ్జి మూల వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో బస్సు రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకుపోయింది. వెంటనే స్థానికులు స్పందించి అందులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. పలువురికి తీవ్ర గాయలయ్యాయి.
కలెక్టర్ పరామర్శ : ప్రమాదంలో గాయపడ్డవారి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరామర్శించడానికి అక్కడికి వెళ్లారు. గాయపడ్డవారిని పరామర్శించారు. డాక్టర్లను వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యం చేయాలని తెలిపారు. ఇదిలా ఉండగా డ్రైవర్ అతి వేగం వల్లనే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపించారు.
అదే రోడ్డు, అదే ప్రాంతం - 20 ఏళ్ల క్రితం భర్త, ఇప్పుడు భార్య
హుస్సేన్‌సాగర్‌లో 2 బోట్లలో భారీ అగ్నిప్రమాదం - బాణాసంచా పేలుస్తుండగా ఘటన