Saif Ali Khan Attack Case : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి సైఫ్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ వీడియోలో ఉన్నది నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అని ఈ సాంకేతికత ద్వారా నిర్ధరించినట్లు పోలీసులు ప్రకటించారు. ఇంతకుముందు దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలడం లేదని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
19 ఫింగర్ ప్రింట్స్ సేకరణ
ఇదిలా ఉండగా, జనవరి 16వ తేదీ తెల్లవారుజామున నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డాడు. విచారణలో భాగంగా నటుడి ఇంటిని పరిశీలించిన విచారణ అధికారుల బృందం అక్కడ ఉన్న దాదాపు 19 ఫింగర్ ప్రింట్స్ ను సేకరించింది. వాటిల్లో ఏవీ నిందితుడి ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్లు ఇటీవల కథనాలు వెలువడ్డాయి.
BIG: These two images are of the same person.
— Rahul Shivshankar (@RShivshankar) January 31, 2025
Mumbai Police Facial Recognition Test (FRT) report throws an exact match between CCTV image recovered from Saif Ali Khan's home CCTV and the image of the arrested accused and Bangladeshi illegal Shariful.
Go figure! pic.twitter.com/uHpT4jqljV
ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడం వల్ల అవి సైఫ్ అలీఖాన్‌వేనా, కాదా? అని నిర్ధరించేందుకు నమూనాలను సేకరించారు.
సైఫ్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై జనవరి 16న దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సైఫ్‌ను లీలావతి ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత ఆకాశ్ కనోజియా అనే యువకుడ్ని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. కానీ, అతడికి నేరంతో ఎటువంటి సంబంధం లేదని నిర్దారణకు వచ్చి వదలిపెట్టారు. ఆ తర్వాత అసలైన నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాంను ముంబయి సమీపంలోని ఠాణెలో అరెస్ట్ చేశారు. కాగా, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.
'పట్టుకునేందుకు ట్రై చేస్తే కత్తితో పొడిచాడు' - దాడి ఎలా జరిగిందో చెప్పిన సైఫ్ అలీఖాన్!
'సైఫ్‌పై నిజంగా దాడి జరిగిందా లేక నటిస్తున్నారా? డిశ్చార్జ్ టైమ్‌లో డ్యాన్స్ ఏంటి?'