వరదలో మునిగిన కారు.. లోపల ఇద్దరు.. అందరిలోనూ టెన్షన్.. చివరకు.. - car flooding videos
🎬 Watch Now: Feature Video
వరద నీటిలో మునిగిపోతున్న కారులోని ఇద్దరు.. అదృష్టవశాత్తూ బయటపడ్డారు. కర్ణాటక చిక్కమగళూరు జిల్లా కడూర్ మండలం శఖరాయపట్నంలో జరిగిందీ ఘటన. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. గ్రామాన్ని వరద ముంచెత్తింది. రోడ్డుపై దాదాపు 5 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. అయితే.. కారు డ్రైవర్ అలానే ముందుకెళ్లగా.. ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. కారు మునిగిపోతుండడాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే రంగంలోకి దిగారు. కారును జేసీబీకి కట్టి, లోపలున్న ఇద్దరిని రక్షించారు.