బర్త్‌డే వేడుకల్లో డాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. అక్కడికక్కడే మృతి - died during dancing
🎬 Watch Now: Feature Video
పుట్టినరోజు వేడుకల్లో డాన్స్ చేస్తూ ఓ వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన జరిగింది. ప్రేమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐవీఆర్ఐ సంస్థలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రభాత్ కుమార్(45) తన స్నేహితుడి చిన్నారి బర్త్‌డే ఫంక్షన్‌కు హాజరయ్యాడు. పార్టీలో పాటలకు హుషారుగా స్టెప్పులేశాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. ఊపిరి ఆగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.