బాలయ్య 'చెన్నకేశవరెడ్డి' రీరిలీజ్.. థియేటర్లు హౌస్‌ఫుల్.. ఫ్యాన్స్ రచ్చరచ్చే - చెన్నకేశవరెడ్డి వార్తలు
🎬 Watch Now: Feature Video
బాలకృష్ణ-వి.వి.వినాయక్ కాంబోలో అప్పట్లో విడుదలై ఘన విజయం సాధించిన 'చెన్నకేశవరెడ్డి'.. సెప్టెంబరు 25 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ భారీ స్థాయిలో రీరిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీక్రాస్ రోడ్స్‌లో బాలయ్య అభిమానులు సందడి చేశారు. దేవీ థియేటర్లో చెన్నకేశవరెడ్డి సినిమాను ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయగా.. థియేటర్ హౌస్‌ఫుల్ అయింది. వందలాది మంది అభిమానులు చేరుకొని బాణాసంచా కాల్చి అభిమానాన్ని చాటుకున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకుడు వి.వి.వినాయక్ థియేటర్‌కు చేరుకొని అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలయ్య ఫ్యాన్స్ నినాదాలతో థియేటర్ పరిసరాలు మారుమోగాయి.
Last Updated : Sep 25, 2022, 4:22 PM IST