మోకాల్లోతు నీరు.. స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. విద్యార్థులంతా.. - స్కూల్ బస్సులో మంటలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16463386-thumbnail-3x2-eee.jpg)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హరియాణాలోని ఫతేబాద్‌లో వరద నీరు రోడ్డు మీద నిలిచిపోయింది. అయితే నగరంలోని ధర్మశాల ప్రాంతంలో విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే విద్యార్థులంతా గట్టిగా అరవడం వల్ల స్థానికంగా ఉన్న దుకాణదారులు అప్రమత్తమయ్యారు. బస్సు దగ్గరకు చేరుకుని కిటికీల నుంచి పిల్లలను బయటకు తీసి సురక్షితంగా కాపాడారు.