ఇనుప తీగలతో గూడు కట్టుకున్న కాకులు.. మీరు ఎప్పుడైనా చూశారా? - ఇనుపతీగలతో కాకుల గూడు కర్ణాటక
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలోని సుళ్య జిల్లాలోని రెండు కాకులు.. ఇనుప తీగలతో గూడు కట్టుకున్నాయి. చొక్కాడిలో భగవాన్ శ్రీ సత్యసాయి విద్యా కేంద్రం ఆవరణలో ఉన్న ఓ చెట్టుపై ఈ అరుదైన గూడు కనిపించింది. అయితే ఈ విషయాన్ని ఆ విద్యాకేంద్రం ప్రొఫెసర్ శంకర్ నెల్యాడి తన ఫేస్బుక్లో ఖాతాలో వీడియో షేర్ చేసి వివరించారు. తాము చెట్టు కొమ్మని తొలగించే సమయంలో ఈ ఇనుప తీగలతో గూడు కనిపించిందని చెప్పారు. ఆ గూడు సుమారు రెండు కేజీలు బరువు ఉన్నట్లు పేర్కొన్నారు. అది చూసిన వెంటనే విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆశ్చర్యానికి లోనయినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ గూడును తమ యూనివర్సిటీ సైన్స్ ల్యాబ్లో భద్రపరిచామన్నారు.