ఆ అనుమానంతో.. యువకుడిని ఉమ్మి నాకించిన పంచాయతీ పెద్దలు! - bihar news
🎬 Watch Now: Feature Video
Youth Forced to Lick Spit: బిహార్ బెగూసరాయ్లో అమానవీయ ఘటన జరిగింది. రూ. 12 వేలు దొంగతనం చేశాడనే అనుమానంతో పంచాయతీ పెద్దలు.. ఓ యువకుడిని ఉమ్మి నాకించి, గుంజీలు తీయించిన దుశ్చర్య మోహన్పుర్ గ్రామంలో వెలుగుచూసింది. ఈ దృశ్యాలను వీడియో తీసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు స్థానికులు. ఆ తర్వాత కూడా అతడిని పోలీసులకు అప్పగించకుండా.. వదిలేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పిన పోలీసులు.. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.