వరదలో కొట్టుకొచ్చిన ఏనుగు పిల్ల.. 65 గంటల శ్రమ తర్వాత తల్లి చెంతకు.. - తల్లి వద్దకు ఏనుగు పిల్ల
🎬 Watch Now: Feature Video
తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి చెందిన అటవీ అధికారులు.. ఓ ఏనుగు పిల్ల కోసం 65 గంటల పాటు కష్టపడ్డారు. గతకొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఏనుగు పిల్ల వరదనీటిలో కొట్టుకొచ్చింది. దానిని గమనించిన అధికారులు రక్షించి.. తన తల్లి దగ్గరకు ఎలాగైనా చేర్చాలని నిర్ణయించారు. అందుకోసం ఎనిమిది బృందాలుగా విడిపోయి మసినగుడి, సింగర అటవీ ప్రాంతాల్లో తల్లి ఏనుగు కోసం వెతికారు. ఎక్కడా దాని జాడ కనిపించలేదు. చివరకు సిగూరు అటవీ ప్రాంతంలో తల్లి ఏనుగును అధికారులు గుర్తించారు. వెంటనే ఏనుగు పిల్లను తల్లి వద్దకు సురక్షితంగా చేర్చారు. దీంతో అధికారులంతా ఆనందంలో మునిగితేలారు.