YS Vivekananda Reddy murder case Updates: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్
🎬 Watch Now: Feature Video
YS Vivekananda Reddy murder case Updates: తెలుగు రాష్ట్రాల్లో అనేక కోణాలు తిరుగుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు నిందితుడు సునీల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సునీల్ యాదవ్ తండ్రి కృష్ణయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో తండ్రి అంతిమ సంస్కారాల కోసం రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సునీల్ యాదవ్.. హైకోర్టును కోరారు. పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. శని, ఆదివారం, తర్వాత ఈనెల 17,18 తేదీల్లో ఇద్దరు ఎస్కార్ట్ సిబ్బంది, వాహనంతో పులివెందుల వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అనంతరం వాహనం, ఎస్కార్ట్ సిబ్బంది ఖర్చును సునీల్ యాదవే భరించాలని స్పష్టం చేసింది. రిమాండ్ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్.. మధ్యంతర బెయిల్ గడువు ముగియగానే కోర్టులో లొంగిపోవాలని స్పష్టం చేసింది.
సునీల్ యాదవ్ పూర్తి బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్.. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్.. చంచల్ గూడ జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో సునీల్ తండ్రి ఇటీవలే మరణించడంతో.. పూర్తి బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. దర్యాప్తు పూర్తయినందున బెయిల్ ఇవ్వాలని సునీల్ యాదవ్ తరుఫు న్యాయవాది వాదించగా.. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున జైళ్లోనే ఉంచాలని సీబీఐ వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.