లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిరం నమూనా- విభిన్న మతాల శిల్పకారులతో నిర్మాణం
🎬 Watch Now: Feature Video
Published : Nov 26, 2023, 4:05 PM IST
|Updated : Nov 26, 2023, 9:05 PM IST
Ram Mandir Replica In Indore : లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిరం నమూనాను నిర్మించారు కొందరు శిల్పకారులు. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో వివిధ రాష్ట్రాలకు, విభిన్న మతాలకు చెందిన 20 మంది శిల్పకారులు కలిసి ఈ నమూనాను నిర్మించారు. దాదాపు మూడు నెలలు శ్రమించి.. పాతబడిన వాహనాలు, విద్యుత్ ఇనుప స్తంబాలు, లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిర నమునాను మలిచారు.
ఈ రామమందిరాన్ని 27 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు. ఈ నమూనాను చేయడానికి మొత్తం 20 టన్నుల ఇనుమును వాడినట్లు శిల్పకారులు తెలిపారు. "తాజ్‌మహాల్, ఈఫిల్ టవర్ లాంటి నమూనాలను నిర్మించారు. కానీ ఇంతవరకు రామమందిరాన్ని ఎవరూ తయారు చేయలేదు. అందుకే స్థానికుల ప్రోత్సహంతో మేము ఈ అయోధ్య రామమందిర నమూనాను నిర్మించాం. ఇంకా నమూనాకు రంగులతో తుది మెరుగులు దిద్దాల్సి ఉంది. అయోధ్యలో రామమందిరం ప్రారంభం కాకముందే నమూనా పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది." అని శిల్పకారులు తెలిపారు.