Rajinikanth's comments on CBN Mulakat : చంద్రబాబుతో ములాఖత్.. తమిళ్ తలైవా రజనీకాంత్ స్పందన ఇది.. - Super Star Rajanikanth

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 2:04 PM IST

Rajinikanth comments on CBN Mulakat : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్​ విషయంలో ఆయన ఆప్త మిత్రుడు తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఓసారి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఆయన కోడలు బ్రాహ్మణి (Brahmani) మరోసారి ములాఖత్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్​మెంట్​ కేసులో ఏపీ సీఐడీ ఈ నెల 9న అరెస్టు చేసింది. 

ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు (Rajamahendravaram Central Jail) లో రిమాండ్ (Remand)​లో ఉన్నారు. ములాఖత్ విషయంలో రజనీకాంత్ స్పందిస్తూ.. చంద్రబాబును కలవాలని ఉన్నప్పటికీ... అనివార్య కారణాలతో కుదరలేదని  అన్నారు. కుటుంబ సంబంధ శుభకార్యాలతో తీరిక లేకుండా ఉన్నందున కలవడం సాధ్యం పడలేదని చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై ఇప్పటికే స్పందించిన రజనీకాంత్‌... లోకేశ్‌(Lokesh)కు ఫోన్‌ చేసి పరామర్శించారు. తన మిత్రుడు పోరాడయోధుడని… చంద్రబాబు తప్పు చేయరని చెప్తూ.. ఆయన చేసిన మంచిపనులు, నిస్వార్థ సేవ ఆయన్ను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.