Winter Carnival at Ramoji Film City : పర్యాటకుల స్వర్గధామమైన రామోజీ ఫిల్మ్‌సిటీలో వింటర్ కార్నివాల్ ఆకట్టుకుంటోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలతో సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రారంభమైన వింటర్ కార్నివాల్‌లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మైమరిపించే సంగీతం, కళాకారుల ప్రదర్శనలు, తమాషా వేషధారణలు, రంగురంగుల విద్యుద్దీపాలు, ఆటపాటలు ఇలా ఎన్నెన్నో విశేషాలు సందర్శకుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి.
రామోజీ ఫిల్మ్‌సిటీ అందాలు : వింటర్ కార్నివాల్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీ అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు సాయంత్రం వేళ జరిగిన కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ తన్మయత్వం పొందుతున్నారు. అందాలను ఆస్వాదిస్తున్నారు. వింటర్ కార్నివాల్ పర్యటన సరికొత్త అనుభూతులు పంచుతోందని సందర్శకులు చెబుతున్నారు. మిలమిల మెరుస్తూ వెలుగులుజిమ్ముతూ పర్యాటకులకు సరికొత్త అనుభూతులను రామోజీ ఫిల్మ్‌సిటీ పంచుతోంది.
విభిన్న వినోద కార్యక్రమాలతో : చిత్రనగరి అందాలను తిలకించేందుకు వచ్చిన సందర్శకులకు రామోజీ ఫిల్మ్‌సిటీ మరిచిపోలేని జ్ఞాపకాలు అందిస్తోంది. పర్యాటకులు మధురానుభూతులతో కలల లోకంలో విహరిస్తున్నారు. విభిన్న వినోద కార్యక్రమాలతో రామోజీ ఫిల్మ్‌సిటీ పర్యాటకుల్ని ఓలలాడిస్తోంది. కార్నివాల్‌లో జరుగుతున్న నృత్యాలు, పాటలు, లైవ్ షోలకు పర్యాటకులంతా మంత్రముగ్ధులవుతున్నారు.
వింటర్ ఫెస్ట్ కార్నివాల్‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా : వింటర్ కార్నివాల్ ఫెస్ట్‌లో కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. చిన్నా పెద్దా ఈ వింటర్ ఫెస్ట్ కార్నివాల్‌లో కేరింతలు కొడుతూ సరదాగా గడుపుతున్నారు. వేడుకల్లో భాగంగా పర్యాటకులంతా లైవ్ డీజేను ఆస్వాదిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు సైతం రామోజీ ఫిల్మ్‌సిటీ అత్యంత వినోదాత్మకంగా జరిగాయి.
"ఇక్కడ చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ప్రతిఒక్కరు వచ్చి చూడాల్సిన ప్రదేశం. సినిమా సెట్లు, రైడ్స్ ప్రతిఒక్కటి సూపర్‌గా ఉన్నాయి. ముఖ్యంగా బాహుబలి సెట్ చాలా బాగుంది.ఇక్కడ కార్నివాల్ సందడిలో ఫుల్ ఎంజాయ్ చేశా. డీజే స్టెప్పులు వేశాం. ఫుడ్ కూడా చాలా బాగుంది. వచ్చేటప్పుుడు ఇలా ఉంటుంది అని అనుకోలేదు. కానీ చూశాకా వావ్ అనే మాదిరిగా ఉంది." - పర్యాటకులు
రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా న్యూ ఇయర్ సంబురాలు - డాన్సులతో ఉర్రూతలూగించిన యువత