prathidhwani Debate on Gandhi Rules in India : 'మన్నించు మహాత్మా.. నేటి పాలకుల్లో కరువైంది నీ స్ఫూర్తి' - గాంధీ స్ఫూర్తిపై ప్రతిధ్వనిలో చర్చా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 8:45 PM IST

Updated : Oct 2, 2023, 9:12 PM IST

prathidhwani Debate on Gandhi Rules in India : యావత్ దేశం, ప్రపంచానికి మహాత్మా గాంధీ జీవితమే ఓ సందేశం. ఆయన జీవితం, బోధనల నుంచి మానవాళికి అందించిన స్ఫూర్తి.. చూపిన బాట అలాంటివి. న్యాయమైన లక్ష్యాలు న్యాయమైన పద్ధతుల్లోనే సాధించొచ్చని ప్రపంచానికి చూపించిన ధీశాలి బాపూ. కానీ ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవడంలో, అమలు చేయడంలో, ముందు తరాలకు అందించడంలో ఎక్కడున్నాం? 

పేదరికం పెరిగిందంటే సమాజం నైతికంగా పతనమైనట్లేనని గాంధీజీ చేసిన హెచ్చరికను నేటినేతలు గమనంలోకి తీసుకుంటున్నారా? సమాజంలో నిత్యకృత్యంగా మారిన పాలకవర్గాల ప్రేరేపిత హింస, మానవహక్కుల ఉల్లంఘనలు ఏ ప్రస్థానాలకు సంకేతం? అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. ఆ నాడు గాంధీజీ చెప్పిన ఈ మాటల స్ఫూర్తి నేటి పాలకుల్లో ఎక్కడైనా కనిపిస్తోందా? స్వతంత్ర ఫలాలు అట్టడుగువర్గాలకూ చేరాలి. బలవంతుల - బలహీనులకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రజాస్వామ్యానికి అర్థమన్నారు బాపూజీ. ఇన్నేళ్లలో ఆ స్ఫూర్తి నెరవేరిందా? మేధావి వర్గమంతా మన్నించు మహాత్మా అని నిర్వేదం వ్యక్తం చేస్తుండడానికి కారణమేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Oct 2, 2023, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.