Police Harsh Behavior on TDP Activist: పోలీసుల కిరాతకం.. టీడీపీ కార్యకర్త గొంతుపై మోకాలితో తొక్కి పట్టి.. విచక్షణ రహితంగా దాడి - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీలో నిరసనలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2023, 9:36 PM IST
Police Harsh Behavior on TDP Activist: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అయిన నేపథ్యంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఓ కార్యకర్త పట్ల పోలీసులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. నడిరోడ్డుపై కింద పడేసి.. గొంతుపై మోకాలితో తొక్కి పట్టారు. ఈ అరాచకంతో ఊపిరాడని తెలుగుదేశం కార్యకర్త.... వదిలిపెట్టాలంటూ దండం పెట్టారు.
Protests in AP Against Chandrababu Arrest: అదే విధంగా పలు చోట్ల ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బాపట్ల జిల్లా రేపల్లె పోలీసు స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. ఉరవకొండలో కూడా గాంధీవిగ్రహం వద్ద తెలుగు యువత నాయకులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
TAGGED:
arachakam