మూగజీవి ప్రేమ.. అన్నం పెట్టిన వ్యక్తి మృతదేహానికి ముద్దుపెట్టి వానరం నివాళి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 8, 2023, 7:47 AM IST

Updated : Apr 8, 2023, 10:02 AM IST

మూగజీవుల స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనగా నిలిచే ఓ దృశ్యం కర్ణాటకలో జరిగింది. తనకు రోజూ అరటిపండ్లు తినిపించే ఓ వ్యక్తికి కడసారిగా ముద్దుపెట్టి నివాళులు అర్పించింది ఓ కొండముచ్చు. విజయనగరం జిల్లా హగరి బొమ్మనహళ్లిలో గురువారం జరిగిన ఈ ఘటన ఎందరో హృదయాలను కలచి వేసింది. ఆ ప్రాంతానికి చెందిన 88 ఏళ్ల పరశురాం షా అనే వృద్ధుడు శుక్రవారం మృతి చెందాడు. ఆయన రోజూ ఓ కొండముచ్చుకు అరటిపండ్లు తినిపించేవాడు. ఆయన అకస్మాత్తుగా మృతిచెందడం వల్ల కుటుంబం శోకసంద్రంలోకి మునిగింది. అయితే వారితో పాటు ఆ కొండముచ్చు కూడా ఆయనకు నివాళులు అర్పించింది. ఆయన మృతదేహం వద్దకు వచ్చిన కొండముచ్చు ఆయనకు ముద్దు పెట్టి పక్కనే కూర్చుంది. అయితే వీరిద్దరి స్నేహం రెండు నెలల క్రితం మొదలయ్యిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతే కాకుండా ఆయన మృతి చెందక ముందు రోజే ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపామని తెలిపారు. పరశురామ్​కు మద్యం సీసా ఆకారంలో ఉన్న కేకును తెచ్చి కోశామని తెలిపారు. 

Last Updated : Apr 8, 2023, 10:02 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.