కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారి - కేరళ అసెంబ్లీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
అధికార, విపక్ష శాసనసభ్యుల ఘర్షణతో కేరళ అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. అసెంబ్లీలో వాయిదా తీర్మానాలపై చర్చించేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వడంలేదని విపక్ష ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. స్పీకర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన ఎమ్మెల్యేలను.. పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో వారిని నియంత్రించేందుకు వచ్చిన భద్రతా సిబ్బందితోనూ ఘర్షణకు దిగారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. స్పీకర్ కార్యాలయం ముందు బైఠాయించిన తమ ఎమ్మెల్యేలను ఈడ్చుకెళ్లారంటూ ఆరోపించారు విపక్ష నేతలు. ఈ ఘటనలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే తిరువంచూర్ రాధాకృష్ణన్, మరో శాసనసభ్యుడు సనీష్ కుమార్ జోసెఫ్ గాయపడ్డారు. వీరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కేకే రమ, టీవీ ఇబ్రహీం, ఏకేఎం అష్రఫ్, ఎం.విన్సెంట్ కూడా ఈ ఘర్షణలో గాయపడ్డారు. కేరళ అసెంబ్లీ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. కొచ్చి డంప్‌యార్డ్ అగ్ని ప్రమాదం, మహిళల భద్రత వంటి అంశాలపై అసెంబ్లీలో UDF ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదని విపక్షాలు తెలిపాయి.