NVS 01 Satellite: విజయవంతమైన NVS 01 ఉపగ్రహ ప్రయోగం.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..? - విజయవంతమైన NVS 01 ఉపగ్రహ ప్రయోగం
🎬 Watch Now: Feature Video
NVS 01 Satellite Launched Successfully: తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో మొదటిదైన ఎన్‌వీఎస్ 01 శాటిలైట్‌ను భారత్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆదివారం ఉదయం 7 గంటల 12 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా ఇరవై ఏడున్నర గంటల తర్వాత షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV-F12 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 2వేల 232 కిలోల బరువున్న ఈ ఉపగ్రహ జీవితకాలం 12 ఏళ్లు. భారత్ ప్రధాన భూభాగం చుట్టూ 15 వందల కిలోమీటర్ల పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను ఇది అందిస్తుంది.
ఈ ఉపగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో రుబిడియం అణుగడియారం ఉంది. అతి తక్కువ దేశాల వద్దే ఉన్న ఈ సాంకేతికతను భారత్ సొంతంగా అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఉన్న ఉపగ్రహాలు అటామిక్ క్లాక్ పనిచేయడం మానేయగానే డేటా పంపడం ఆపేస్తాయి. కచ్చితమైన ట్రాకింగ్‌నూ ఇవి అందించలేవు. రెండో తరం నావిక్ ఉపగ్రహాలు అమెరికా జీపీఎస్ సాంకేతికతలో వినియోగించే L1 సిగ్నల్స్‌ను పంపగలవు. ఈ సిగ్నల్స్‌తో ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్ వ్యవస్థలు మరింత మెరుగ్గా పనిచేస్తాయి.