Interview with IFS first ranker: సామాజిక మాధ్యమాలకు దూరం.. ఫలితంగా ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్..!
🎬 Watch Now: Feature Video
Interview with IFS first ranker Kollur Srikanth: యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. ఇటీవల వెలువడిన ఐఎఫ్ఎస్ ర్యాంకుల్లో బాపట్ల జిల్లాకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ జాతీయ స్థాయిలో ఒకటో ర్యాంకు సాధించి ఔరా అనిపించాడు. తొలి ప్రయత్నంలో విఫలమైనా.. మలి ప్రయత్నంలో లక్ష్యాన్ని ఛేదించాడు. ర్యాంకు సాధించడమే ధ్యేయంగా ముందుకు సాగిన వెంకట శ్రీకాంత్.. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ ప్రిపరేషన్‌ను కొనసాగించాడు. చదువుకున్న విద్య, చేస్తున్న ఉద్యోగం సమాజానికి ఉపయోగపడినప్పుడే అసలైన సార్ధకత అంటున్నాడు.. ఫలితంగా మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ప్రజలు, పరిసరాలు, ప్రకృతి బాగా ఉండాలని అంటే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెంకట శ్రీకాంత్ అంటున్నాడు. మరి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం అతడికెలా సాధ్యమైంది.? అటవీ రంగం వైపు మళ్లడానికి కారణాలేంటి.? భవిష్యత్ లక్ష్యాలేంటి.? అనే విషయాలను ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంకర్ కొల్లూరు వెంకట శ్రీకాంత్‌ను అడిగి తెలుసుకుందాం.