మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం ఎప్పుడో..? - Women Reservation Bill in Parliament
🎬 Watch Now: Feature Video
Womens Reservation Bill: ప్రస్తుతం మహిళలు అన్నిరంగాల్లో అత్యున్నత స్థానాలకు ఎదుగుతున్నారు. ఎన్నికల ప్రక్రియలోనూ వారి భాగస్వామ్యం పెరిగింది. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో వారి స్థానం ఎక్కడ? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటని అడిగితే దేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరి నోరు పెగలదు. కారణం.. గత పార్లమెంటునే చూస్తే మహిళల ప్రాతినిధ్యం కేవలం 11 శాతం. అంటే ప్రతి 90 లక్షల మంది మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఒక్క మహిళ మాత్రమే. ఈ పరిస్థితి మారాలి అంటే అందరి నుంచి వినిపించే డిమాండ్... రాజకీయాలలో మహిళల పాత్ర పెరగాలి.. అందుకు చట్టసభల్లో వారికి రిజర్వేషన్లు కల్పించాలి అని. కానీ దశాబ్దాలు మహిళా రిజర్వేషన్లబిల్లు మాత్రం పార్లమెంట్ గడప దాటడం లేదు. ఆ సుదీర్ఘ నిరీక్షణకు మోక్షం ఎప్పుడు? మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ఇప్పటికీ వెనకబడే ఉన్నారు. లోక్‌సభ, శాసనసభల్లో 33% సీట్లు మహిళలకు ఇవ్వాలనే..గొప్పసంకల్పంతో రూపుదిద్దుకున్న మహిళారిజర్వేషన్ల బిల్లు..1996లో తొలిసారి లోక్‌సభ ముందుకు వచ్చింది. చివరకు ఆ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా.. లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దవడంతో ఆ తరువాత దాని ప్రస్తవానే రాలేదు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.