ఒకే ఇంట్లో 60 పాములు.. చంపినకొద్దీ బయటకు వస్తూ..
🎬 Watch Now: Feature Video
Snake rescue video bihar : బిహార్లోని రోహ్తాస్లో ఒకే ఇంట్లో 50- 60 పాములు కనిపించడం కలకలం రేపింది. ఒకే దగ్గర అన్ని పాములు చూసి అటవీ శాఖ అధికారులే షాక్ అయ్యారు. సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అగ్రోఢ్ ఖుర్ద్ గ్రామంలోని ఓ ఇంట్లో ఈ పాములు కనిపించాయి. బుధవారం వరుసగా ఒక్కో పాము ఇంట్లో నుంచి బయటకు వచ్చాయని ఇంటి యజమాని కృపానారాయణ్ పాండే తెలిపారు. చుట్టూ తనిఖీ చేయగానే అరడజనుకు పైగా సర్పాలు కనిపించాయని చెప్పారు. వెంటనే ఆందోళనకు గురైన వీరంతా.. పక్కింటి వారిని పిలిచారు. కొన్ని పాములను కొట్టి చంపేశారు. కొద్దిసేపటికి మరికొన్ని పాములు బయటకు రావడం మొదలైంది. వచ్చిన పాములను వచ్చినట్టే చంపేశారు. ఇలా రెండు డజన్ల సర్పాలను చంపారు. అయినప్పటికీ మరిన్ని పాములు బయటపడటం వల్ల.. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Snake catcher video in India : రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు.. సహాయక బృందాలతో కలిసి గురువారం పాములను పట్టుకున్నారు. ఇంటి గోడలు, ఫ్లోర్ పగులగొట్టి సుమారు 30 పాములను బయటకు తీశారు. ఈ సర్పాలన్నీ ఇండియన్ కోబ్రా జాతికి చెందినవని పాములను రక్షించిన అమర్ గుప్తా తెలిపారు. తాము రక్షించిన 30 పాములలో పన్నెండింటికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. వాటికి చికిత్స చేసిన తర్వాత అడవిలో విడిచిపెడతామని స్పష్టం చేశారు.
రెండంతస్తుల ఈ ఇంటిని 1955లో నిర్మించినట్లు కృపానారాయణ్ తెలిపారు. ఇప్పటివరకు ఇన్ని పాములను ఒకేసారి చూడలేదని చెప్పారు.