Actor Shahrukh Khan Visited Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్.. - టీటీడీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Sep 5, 2023, 10:49 AM IST
Actor Shahrukh Khan Visited Tirumala: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ దర్శించుకున్నారు. సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్న 'జవాన్' మూవీ సక్సెస్ కావాలని మూవీ టీమ్‌తో కలిసి వేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ దర్శన సమయంలో షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహాన ఖాన్‌తో, సినీ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. వారికి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ కాబోతున్న 'జవాన్' మూవీ సక్సెస్ కావాలని షారుఖ్ ఖాన్ శ్రీవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల విచ్చేసిన షారుఖ్‌ను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. కొందరు ఆయనతో సెల్ఫీల్ దిగారు. షారుఖ్ ఉన్నంతవరకు ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది.
TAGGED:
Actor Shahrukh Khan at ttd