Achchennaidu Fire on Chandrababu Naidu's Arrest : రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు.. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది : అచ్చెన్నాయుడు - ఏపీ ప్రధానవార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 10, 2023, 11:14 AM IST
Achchennaidu fire on Chandrababu Naidu's arrest : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ కక్షతో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే జగన్ పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టి ఆనందపడుతున్న వ్యక్తి జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని అన్నారు. దేశంలో ఏ ఒక్కరిని అడిగినా చంద్రబాబు దార్శనికత చెబుతారన్న అచ్చెన్నాయుడు.. తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి చంద్రబాబును స్కిల్ కేసు ( skill case ) లో ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులకు భయపడేది లేదని, ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. జగన్, ఆయన పార్టీని పెల్లుబికిన ప్రజాగ్రహం బంగాళాఖాతంలో కలిపేస్తారని అన్నారు.
అవినీతి అంటే జగన్.. జగన్ అంటేనే అవినీతి అని అచ్చెన్నాయుడు విమర్శించారు. క్విడ్ ప్రో కో ( Quid Pro Co ) ద్వారా దాదాపు 40 వేల కోట్ల రూపాయలు జగన్ షెల్ కంపెనీల్లో ( Jagan Shell Companies) చేరాయని ఈడీ ఎప్పుడో చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబుపై, లోకేశ్ బాబుపై, తనపై కేసులు పెట్టడం ద్వారా టీడీపీ శ్రేణులను భయపెట్టలేరని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ధర్మమా.. న్యాయమా..? అని ప్రశ్నించారు. రాజకీయ కక్ష, అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి చేస్తున్న కుట్ర అని దుయ్యబట్టారు. జాతీయ నాయకుడిని రాత్రి వేళ అరెస్టు చేసి రోడ్లపై తిప్పడం.. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని, నూకలు చెల్లాయని అచ్చెన్నాయుడు అన్నారు.