ACB Raids: రాష్ట్రంలో పలు ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు.. అదుపులో పలువురు కీలక అధికారులు
🎬 Watch Now: Feature Video
ACB Officials Raids on RTA Interstate Check Post : రాష్ట్రంలో పలు చోట్లు ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. శ్రీకాకుళం, ఏలూరు, క్రిష్ణా జిల్లాల సరిహద్దులోని ఆర్టీఏ చెక్‌పోస్టులపై తెల్లవారుజామున ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని ప్రభుత్వం నిర్దేశించిన రుసుముకు అదనంగా వసూళ్లుకు పాల్పడుతున్నారని ఫిర్యాదు అందింది. అందుకే ఒరిస్సా సరిహద్దు ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా, తెలంగాణ సరిహద్దు జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా, గన్నవరం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆర్టీఏ చెక్‌పోస్టులపైన సోదాలు చేశామని అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా చెక్ పోస్ట్ వద్ద జరిపిన సోదాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఇద్దరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో పాటు సిబ్బంది వద్ద నుంచి ప్రభుత్వానికి చెందిన 5,00,000 రూపాయలు.. అనధికారకంగా వసూలు చేసిన 2,21,000 రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ సరిహద్దు జీలుగుమిల్లి ఏలూరు జిల్లా చెక్పోస్ట్ వద్ద జరిపిన సోదాల్లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఇద్దరు హోం గార్డ్స్ వద్ద ప్రభుత్వానికి చెందిన 1,05,000తో పాటు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి 1,23,000 రూపాయలు.. 30,000 స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం వద్ద తత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆర్టీఏ చెక్ పోస్టు వద్ద జరిపిన సోదాల్లో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి సుమారు 19,000 రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.