యువతపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం: పీవీ రమేశ్ - RETIRED IAS PV RAMESH
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2024, 5:15 PM IST
Retired IAS PV Ramesh on Social Media Issue : భావ ప్రకటన పేరుతో సామాజిక మాధ్యమాల్లో విష సంస్కృతి ప్రబలుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై లక్ష్మణరేఖ విధించాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ అభిప్రాయపడ్డారు. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ''సోషల్ మీడియాలో విష సంస్కృతి'' అనే చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు.
"నో స్మార్ట్ ఫోన్" విధానాన్ని తీసుకురావాలి: అధునాతన సాంకేతికత వల్ల గత మూడు దశాబ్ధాల కాలంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రమేశ్ అన్నారు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిందని, అయితే ఇది వ్యసనంగా మారి యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మత్తు పదార్ధాలు, డ్రగ్స్ కంటే ప్రమాదకరమని రమేశ్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అఖిలపక్షాలు, మేధావులు, పౌర సంఘాలతో చర్చించి సామాజిక మాధ్యమాల్లో వినియోగంపై నూతన నిబంధనలను రూపొందించాలని అభిప్రాయపడ్డారు. విద్యా సంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో "నో స్మార్ట్ ఫోన్" విధానాన్ని తీసుకురావాలని సూచించారు. సోషల్ మీడియా అరాచకంగా మారి మొత్తం ప్రజాస్వామ్యాన్ని తినేస్తుందని ఈ సభకు హాజరైన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు.