Kannappa Movie Team Visits Srikalahasti Temple : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కన్నప్ప చిత్రం బృందం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకుంది. సినీ నటులు మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు, ప్రభుదేవాలు ఆలయానికి చేరుకుని శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. అక్కడే సినిమా టీజర్‌ని ప్లే చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ మంచు విష్ణు ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఈ సినిమా కోసం ఎన్నో నెలలుగా కష్టపడి పని చేశామని తెలిపారు. టీజర్‌ను అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 1న కన్నప్ప చిత్రం టీజర్ విడుదల చేస్తామన్నారు. అలాగే ఏప్రిల్ 25న కన్నప్ప చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మంచు మోహన్‌బాబు తెలిపారు. కన్నప్ప చిత్రం విజయానికి భగవంతుడితో పాటు ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు. ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లును ప్రశంసించారు.
విష్ణు కలల ప్రాజెక్టు ఇది. శివ భక్తుడైన కన్నప్ప జీవితాధారంగా దర్శకుడు ముకేశ్ కుమార్‌సింగ్ తెరకెక్కిస్తున్నారు. విష్ణు కుమారుడు అవ్రామ్, కుమార్తెలు ఇందులో నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది.
కన్నప్పలో రుద్రుడిగా ప్రభాస్- ఫస్ట్ లుక్ సూపర్బ్- గూస్ బంప్సే!
మంచు విష్ణు 'కన్నప్ప'అప్డేట్- శివుడిగా బాలీవుడ్ హీరో- పోస్టర్ రిలీజ్