Minister Satya Kumar Yadav Watched Chhaava Movie : ఛత్రపతి శివాజీ, శంభాజీలాంటివారిపై మరిన్ని సినిమాలు రావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఏడున్నరేళ్ల తర్వాత థియేటర్‌కు వచ్చి ‘ఛావా’ చిత్రం చూశానని మంత్రి తెలిపారు. శంభాజీ సినిమా చూశాక ఒక వీరుడి సినిమా చూశాననే ఆనందం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఒక వీరుడి ముగింపు అలా జరిగినందుకు వేదనగా ఉందన్నారు. వ్యాపారం కోసం స్మగ్లర్లను హీరోలుగా చూపించే చిత్రాలు తీయవద్దని సూచించారు.
అలాంటి సినిమాలు వద్దు : ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్లను మొదటి స్వాతంత్య్ర యోధులుగా చెప్పాలని మంత్రి స్పష్టంచేశారు. సమకాలీన చరిత్రకారుల పైన సినిమా తీయాలన్నారు. అంతేగాని హీరోలు గంజా, డ్రగ్స్ తీసుకునేవి చూపించకూడదని తెలిపారు. వీరసావర్కర్ వర్ధంతి సందర్భంగా మరొక వీరుని సినిమా చూశానని వెల్లడించారు.
వారిని హీరోలుగా సృష్టించారు : సూరత్ నుంచీ తంజావూరు వరకూ శంభాజీ హిందూ సామ్రాజ్యం నెలకొల్పాడని మంత్రి సత్యకుమార్ తెలిపారు. మన దేశానికి వలస పాలకులను గొప్ప హీరోలుగా చరిత్రకారులు సృష్టించారని గుర్తుచేసుకున్నారు. 60 ఏళ్లకు పైగా ఏలిన పార్టీ మనకు మొఘలులు గొప్పవారనే భావన కలిగించారన్నారు. తల్లి, తండ్రి సోదరులను చంపిన వారిని గొప్పవారుగా ఆ పార్టీ చూపించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తండ్రిని కారాగారానికి పంపి చంపిన చరిత్ర హీనుడి గురించి గొప్పగా ఆ పార్టీ చెప్పిందన్నారు. శంభాజీ, శివాజీ లాంటి వారి చరిత్ర మనం చదువుకోవాలన్నారు.
త్వరలో క్లినికల్ సైకాలజీ కోర్సులు - ఆ సమస్యతో బాధపడేవారికి ఇక శ్రీరామ రక్ష!
ఆస్పత్రుల్లో MAY I HELP YOU డెస్క్‌లు- అందుబాటులో మహా ప్రస్థానం వాహనాలు:సత్యకుమార్