కుప్పకూలిన క్వారీ - నుజ్జునుజ్జయిన ప్రొక్లెయిన్, ట్రాక్టర్, బైక్ - కార్మికులు షాక్ - STONE QUARRY ACCIDENT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2024, 5:46 PM IST

Kachavaram Stone Quarry Accident: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ శివారు కాచవరం గ్రామ పరిధిలోని రాతి క్వారీలో పెనుప్రమాదం తప్పింది. క్వారీపై నుంచి పెద్దపెద్ద బండరాళ్లు దొర్లి కింద ఉన్న బైక్‌, ట్రాక్టర్‌, ప్రొక్లెయిన్​పై పడ్డాయి. దీంతో అవి పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అదే సమయంలో క్వారీలో పనిచేస్తున్న కార్మికులు భోజనం కోసం అని కిందికి దిగివచ్చారు. వారంతా భోజనం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  

ఈ ఘటనలో ఆపరేటర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే బాధితున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్​, ప్రొక్లెయిన్ నుజ్జునుజ్జు కావడంతో, కార్మికులు ఆందోళన చెందారు. కాస్త సమయం ముందు ఈ ఘటన జరిగి ఉంటే భారీ ప్రమాదం చోటుచేసుకుని ఉండేదని షాక్​కు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ పెద్ద గాయాలు కాకపోవడండో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్న ప్రమాదం అనంతరం దృశ్యాలను ఈ వీడియోలో చూద్దాం. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.