అసభ్యకర పోస్టులు పెట్టేవారు ప్రపంచంలో ఎక్కడున్నా తప్పించుకోలేరు : సీపీ
🎬 Watch Now: Feature Video
NTR District Commissioner Rajasekhar Babu ON Social Media Cases: సామాజిక మధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో 70కి పైగా కేసులు నమోదు చేశారు. 169 హ్యాండలర్స్ పై పోలీసులు నిఘా పెట్టారు. అసభ్యకర పోస్టులు పెడుతున్నవారు ప్రపంచంలో ఎక్కడున్నా చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా కేసుల దర్యాప్తు జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కమీషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయారు. అలాంటి వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అప్పట్లో వారు కన్నూమిన్నూ కానక అవతలి వ్యక్తులను ఇష్టానుసారం తిడుతూ, మార్ఫింగ్ ఫొటోలు పెడుతూ పైశాచిక ఆనందం పొందారు. రకరకాల సోషల్ మీడియా వెబ్సైట్లలో వైఎస్సార్సీపీ ముఠాలు విషం చిమ్ముతూ అసభ్యకర పదజాలంతో కామెంట్లు పెట్టేవారు. ఇప్పుడు వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.