Police Notice to Ram Gopal Varma : దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(ఆర్జీవీ)ని అసభ్యకర పోస్టుల కేసు వెంటాడుతోంది. ఈ వ్యవహారంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆయనకు వాట్సప్ ద్వారా ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు తెలిపారు. 4న సినిమా షూటింగ్‌ల నిమిత్తం బిజీగా ఉంటానని విచారణకు రాలేనని ఆయన సమాధానమిచ్చారు. 7వ తేదీన విచారణకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తానని రామ్‌గోపాల్ వర్మ చెప్పినట్లు తెలుస్తోంది.
గతంలో రెండుసార్లు ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరుకాలేదు. అనంతరం హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. దర్యాప్తునకు సహకరించాలని, పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని వర్మకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Ram Gopal Varma Case Updates : సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్యమాల వేదికగా రామ్‌గోపాల్ వర్మ అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
రామ్‌గోపాల్ వర్మకు బిగ్ షాక్ - మూడు నెలలు జైలు శిక్ష
'RGV సినిమా ఒక్కసారి చూస్తే రూ.11వేలు' - నోటీసులు పంపిన APSFL