ETV Bharat / state

సెకితో సౌరవిద్యుత్‌ కొనుగోలు ఒప్పందం - అధిక ధర ఎందుకంటే - అడ్డగోలు వాదన - SECI AND ADANI GROUP RELATIONSHIP

ఎక్కువ ధరకు సౌరవిద్యుత్‌ ఎందుకు కొంటున్నారంటే సగటు ధర కంటే తక్కువే అంటారేంటి?

Adani Bribe to YS Jagan
Adani Bribe to YS Jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2024, 9:29 AM IST

YSRCP Govt Deal With SECI : మార్కెట్‌లో సౌరవిద్యుత్‌కు ఉన్న ధర కంటే యూనిట్‌ అర్ధరూపాయి ఎక్కువిచ్చి కొనేలా ఒప్పందం ఎందుకు చేసుకున్నారంటే గతంలో కొన్న ధర కంటే ఇది తక్కువే తెలుసా అనడం అడ్డగోలు వాదన కదా! సెకి నుంచి ఏకంగా 7000ల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో అప్పటి వైఎస్సార్సీపీ సర్కార్ ఇలాంటి అడ్డగోలు, అతితెలివి సమాధానమే చెప్పింది. ఆ ఒప్పందంలో విద్యుత్‌ ఉత్పత్తిదారయిన అదానీ నుంచి వందల కోట్ల ముడుపుల్ని జగన్‌ పొందారన్న అమెరికా విచారణ సంస్థ కేసు నేపథ్యంలో అధిక ధరకు కొన్న అంశం ఇప్పుడు తెరపైకి వచ్చి, కీలక ప్రశ్నగా నిలిచింది.

  • 2016లో 55 అంగుళాల సోనీ కంపెనీ 4కే ఎల్‌ఈడీ టీవీ ధర రూ.2 లక్షలకు పైనే ఉంది. 4కే టెక్నాలజీ అప్పుడే కొత్తగా అందుబాటులోకి రావడంతో ధర ఎక్కువ. అదే మోడల్‌ టీవీ 2018లో సుమారు రూ.1.20 లక్షలకు వచ్చింది. 2024కి వచ్చేసరికి గతంలో కంటే అనేక అధునాతన ఫీచర్లతో, పూర్తి ఎల్‌ఈడీ సదుపాయంతో రూ.55,000లకే దొరుకుతోంది. కొన్ని కంపెనీల టీవీలైతే రూ.35,000లకే అందుబాటులో ఉన్నాయి. టీవీల వినియోగం పెరగడం, విడిభాగాలు దేశీయంగానే తయారవడం, సాంకేతికత పెరగడంతో ధరలు గణనీయంగా తగ్గాయి. ఇంకా తగ్గుతున్నాయి కూడా!
  • 2024లో ఎవరైనా 55 అంగుళాల 4కే ఎల్‌ఈడీ టీవీ కొనాలనుకుంటే రూ.35,000ల నుంచి రూ.55,000ల వరకు ఉన్న టీవీల్లో ఒకదాన్ని ఎంచుకుంటారా? లేకపోతే మార్కెట్‌లో రూ.55,000 లున్న సోనీ టీవీని రూ.90,000లకు కొనేసి, 2016 నుంచి ఇప్పటి వరకు సోనీ టీవీల ధరల సగటు లెక్కేస్తే రూ.లక్ష వచ్చిందని, తాను రూ.90,000లకే కొన్నాను కాబట్టి, రూ.10,000లు ఆదా చేశానని చెబుతారా? ఎంత తెలివితక్కువ వాళ్లయినా ఆ పని చేయరు కదా!
  • ఇంటెల్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు గార్డన్‌ మూర్‌ ప్రతిపాదించిన ప్రఖ్యాత ‘మూర్స్‌ లా’ ప్రకారం ఒక మైక్రోచిప్‌లో అమర్చే విడిభాగాల సంఖ్య ప్రతి రెండు సంవత్సరాలకు రెట్టింపవుతుంది. దానివల్ల సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు, ఖర్చు కూడా తగ్గుతుంది. సెమీకండక్టర్‌ టెక్నాలజీ విప్లవానికి చోదకశక్తిగా భావించే ఈ మూర్స్‌ సిద్ధాంతాన్ని ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలో ‘గోల్డెన్‌ రూల్‌’గా పరిగణిస్తారు. ఈ సూత్రం ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమకే కాదు సౌర విద్యుదుత్పత్తిలో వినియోగించే సౌర ఫలకాల వంటి వాటికీ వర్తిస్తుంది.
  • దేశంలో సౌర విద్యుత్‌ ఫలకాల తయారీ లేనప్పుడు వాటిని పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి చేసుకునేవాళ్లం. దేశంలో వాటి తయారీ మొదలవడం, సాంకేతికత పెరగడంతో ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. పదిహేను సంవత్సరాల క్రితంతో పోలిస్తే సౌరఫలకాల ధరలు ఇప్పుడు సుమారు 84 శాతం తగ్గాయి. ఆ మేరకు సౌరవిద్యుత్‌ ధరలూ తగ్గాయి. ఒకప్పుడు యూనిట్‌ సౌరవిద్యుత్‌ ధర రూ.18-19 ఉండేది. నేషనల్‌ సోలార్‌ మిషన్‌లో భాగంగా 2010లో సౌరవిద్యుత్‌ ఒప్పందాలు చేసుకునేటప్పటికి యూనిట్‌ రూ.12.16 ఉంది. 2021కి రూ.1.99కి తగ్గింది. 2010తో పోలిస్తే సుమారు 83 శాతం తగ్గినట్టు. ఇంకా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
  • వినియోగం పెరుగుతూ, టెక్నాలజీ అభివృద్ధి చెందేకొద్దీ విద్యుత్, చిప్‌లు, సెమీ కండక్టర్లు, వాటితో తయారయ్యే ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల ధరలు ఎలా తగ్గుతూ వస్తాయో చెప్పేందుకు ఇవన్నీ ఉదాహరణలు. ఎంత సామాన్యుడికైనా ఈ లాజిక్‌ ఇట్టే బోధపడుతుంది. ఘనత వహించిన అప్పటి సీఎం జగన్‌కు, ఆయన వందిమాగధులకు తప్ప!
  • పైన చెప్పుకొన్న టీవీ ఉదాహరణనే చూస్తే మార్కెట్‌లో రూ.35,000ల నుంచి రూ.50,000లు ఉన్న టీవీని రూ.90,000లకు కొని, కొన్నేళ్ల సగటు ధరతో పోలిస్తే రూ.10,000లు మిగిల్చానని ఎవరైనా చెబితే అతణ్ని పిచ్చోడిగా లెక్కేయాలి. లేకపోతే దుకాణదారుతో కుమ్మక్కై మిగతా డబ్బు నొక్కేసిన అవినీతిపరుడిగానైనా లెక్కగట్టాలి!
  • మార్కెట్‌లో సౌరవిద్యుత్‌ యూనిట్‌ రూ.1.99కి దొరుకుతుంటే రూ.2.49కి కొనేందుకు సెకితో ఒప్పందం చేసుకోవడమే కాకుండా, కొన్నేళ్లలో గత ప్రభుత్వాలు చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల సగటు ధర యూనిట్‌కి రూ.5.10 కాబట్టి, దానితో పోలిస్తే తాను ఆదా చేస్తున్నానని చెప్పిన అప్పటి సీఎం జగన్‌ను కూడా ఇలాగే పరిగణించాలి.

ఆఘమేఘాలపై ఒప్పందం : ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద రాజస్థాన్‌లో సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్న సెకి ఆ విద్యుత్‌ను యూనిట్‌ రూ.2.49 చొప్పున కొనాలంటూ 2021 సెప్టెంబర్ 15న జగన్‌ సర్కార్​కి లేఖ రాసింది. ఆ మర్నాడే జగన్‌ మంత్రిమండలి సమావేశం పెట్టి నిర్ణయం తీసేసుకున్నారు. అదానీ రంగంలోకి దిగి అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో పలు దఫాలు సమావేశమై ముడుపులపై ఒక అవగాహనకు వచ్చాకే ఒప్పందం జరిగిందని అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.

కిలో వంకాయలు కొనేటప్పుడే ఏ కొట్లో ఎంత ధర ఉందో చూసుకుని, ఒకటికి రెండుసార్లు బేరం చేసి కొంటామే, అలాంటిది 7000ల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు పాతికేళ్లపాటు ఒప్పందం చేసుకోవాలంటే సర్కార్ ఎంత ఆలోచించాలి? ఎన్ని కోణాల్లో పరిశీలించాలి? కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పదులకొద్దీ సలహాదారులు, వందిమాగధుల్లాంటి కొందరు ఐఏఎస్‌ అధికారులతో అలరారిన జగన్‌ ప్రభుత్వం మెరుపు వేగంతో గంటల వ్యవధిలో నిర్ణయం తీసేసుకుంది.

Adani Bribery Case Updates : అప్పటికి మార్కెట్‌లో సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.1.99కే దొరుకుతున్నప్పుడు ఒక్కో యూనిట్‌కి అర్ధరూపాయి ఎక్కువ పెట్టి ఎందుకు కొంటున్నారని అడిగితే అప్పటికి రాష్ట్రప్రభుత్వం కొంటున్న యూనిట్‌ సగటు ధర రూ.5.10 ఉంది కాబట్టి, తామే తక్కువ ధరకు కొన్నామని వితండ వాదానికి దిగింది. ఇంగితం ఉన్నవాళ్లెవరైనా అప్పటి మార్కెట్‌ ధరతో పోలుస్తారా? ఎప్పుడో యూనిట్‌ రూ.18-19 ఉన్నప్పటి నుంచీ సగటు లెక్కేసి దాని ప్రకారం తాము తక్కువ ధరకే కొంటున్నామని చెబుతారా? 2015లో అప్పటి సర్కార్ యూనిట్‌ రూ.5.96కి ఒప్పందం చేసుకుందని, దానితో పోలిస్తే తక్కువ ధరకు కొన్నామని సమర్థించుకోవడమేంటి? ఏటా సౌరవిద్యుత్‌ ధరలు తగ్గుతున్నప్పుడు 2015లోని ధరలతో ఎలా పోలుస్తారు? సెకితో ఒప్పందంలో భారీ అవినీతి, కుంభకోణం జరిగాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?

‘సెకి’నే తక్కువ ధరకు కొంటున్నా కనిపించలేదా? : అదానీ సంస్థ నుంచి తీసుకునే సౌర విద్యుత్‌ను యూనిట్‌ రూ.2.49 చొప్పున విక్రయించేందుకు 2021 డిసెంబర్​లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సెకి దానికి సంవత్సరం ముందు అల్‌జొమాయ్‌ అనే సంస్థతో యూనిట్‌ రూ.2కి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. 2020 జనవరి నుంచి సెకి వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల్ని పరిశీలిస్తే ఆరు నెలల వ్యవధిలోనే యూనిట్‌కు 50 పైసల చొప్పున ధర తగ్గినట్టు అర్థమవుతోంది. కానీ జగన్‌ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా ఎవరో తరుముకొస్తున్నట్టుగా, ఆలస్యమైతే రాష్ట్రం బంగారం లాంటి అవకాశం కోల్పోతుందన్నట్టుగా ఆఘమేఘాలపై సెకితో ఒప్పందం చేసుకోవడంలో దురుద్దేశం లేదంటే ఎవరు నమ్ముతారు?

  • గుజరాత్‌ ఊర్జా వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (జీయూవీఎన్‌ఎల్‌) 80 మెగావాట్లకు యూనిట్‌ రూ.1.99 చొప్పున అల్‌జొమాయ్‌తో 2021 జనవరి 30న ఒప్పందం చేసుకుంది.
  • 2020 మార్చిలో 2000ల మెగావాట్లు యూనిట్‌ రూ.2.36కి కొనేందుకు సెకి ఒక ఒప్పందం చేసుకుంది.
  • అదే సెకి 2020 జులైలో 1070 మెగావాట్లు కొనేందుకు టెండర్లు పిలిచి యూనిట్‌ రూ.2 చొప్పున కొనేందుకు అల్‌జొమాయ్‌తో, రూ.2.01కి కొనేందుకు గ్రీన్‌ ఇన్‌ఫ్రా విండ్‌ ఎనర్జీ లిమిటెడ్, ఎన్‌టీపీసీలతో ఒప్పందాలు చేసుకుంది.
  • రాష్ట్రప్రభుత్వం సెకితో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుంది 2021 డిసెంబర్​లో. అంటే విద్యుత్‌ ధరల్ని ఇంకా తగ్గించాలని బేరమాడాలి. అదేమీ లేకుండా యూనిట్‌ రూ.2.49 చొప్పున కొనడమే కాకుండా, అడ్డగోలు వాదనకు దిగడం అప్పటి జగన్‌ సర్కార్​కే చెల్లింది.

అజేయకల్లం ప్రవచనాలు ఏమయ్యాయి? : '2010లో యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.18 ఉంటే 2018లో యూనిట్‌ రూ.2.44కి తగ్గింది. గత సర్కార్ చేసుకున్న ఒప్పందాల్లో ధరలు దానికంటే ఎక్కువ. మనకు తగినంత విద్యుత్, బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం పీపీఏలు ఎందుకు చేసుకుంది? ఎలాంటి పీపీఏలు, ప్రభుత్వం నుంచి దీర్ఘకాలిక హామీలు లేకుండానే 5000ల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు'. గత టీడీపీ సర్కార్​పై బురదజల్లేందుకు 2019 జులై 15న ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అప్పటి సీఎం జగన్‌ సలహాదారు అజేయకల్లం చెప్పిన ప్రవచనాలు ఇవి!

2018 నాటికే యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.18 నుంచి రూ.2.44కి తగ్గిందని తెలిసినప్పుడు 2021లో సెకితో ఒప్పందం చేసుకునేనాటికి ధర మరింత తగ్గి ఉంటుంది కదా? కానీ యూనిట్‌ రూ.2.49కి కొనేందుకు ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? సెకి 2024కి విద్యుత్‌ సరఫరా చేస్తామని చెప్పింది. ఎలాంటి పీపీఏలు అవసరం లేకుండానే 5000ల మెగావాట్ల సరఫరాకు విద్యుత్‌ సంస్థలు సిద్ధంగా ఉన్నప్పుడు సరఫరాకు మూడు సంవత్సరాల ముందే సెకితో అంత ఎక్కువ ధరకు ఒప్పందం చేసుకోవడమేంటి? గతంలో చంద్రబాబు సర్కార్ 20 ఏళ్లకు పీపీఏలు చేసుకున్నందుకే వైఎస్సార్సీపీ నేతలు నానా యాగీ చేశారే, దీర్ఘకాలిక పీపీఏలు అవసరం లేదన్నట్టు మాట్లాడారే మరి సెకితో 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకోవడమేంటి?

జగన్‌ పాత్ర నిజమే అయితే క్షమించరానిది - మంత్రిగా చేసినందుకు బాధపడుతున్నా: బాలినేని

వీళ్లిద్దరి బంధం చాలా కాస్ట్లీ - పోర్టుల నుంచి మీటర్ల దాకా అన్నీ అదానీకే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.