ETV Bharat / bharat

సైఫ్​పై ఎటాక్​ సీన్ రీక్రియేషన్​! బాత్​రూమ్​ కిటికీ నుంచి ఇంట్లోకి దొంగ - SAIF ALI KHAN ATTACK CASE

సైఫ్ అలీ ఖాన్​​పై దాడి ఘటన- వెలుగులోకి కీలక విషయాలు

Saif Ali Khan Case
Saif Ali Khan Case (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2025, 7:59 AM IST

Saif Ali Khan Case : ముంబయి బాంద్రాలోని బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఇటీవల జరిగిన దాడి ఘటనను రీక్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ అధికారి తెలిపారు. దర్యాప్తులో భాగంగా తమ కస్టడీలో ఉన్న నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌(30)ను నేర దృశ్యాన్ని రీక్రియేట్ చేసేందుకు సైఫ్ అలీఖాన్ నివాసానికి ఐదు రోజుల్లో పోలీసులు తీసుకెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దొంగతనం కోసమే!
దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో జనవరి 16వ తేదీన తెల్లవారుజామున బాలీవుడ్ స్టార్ సైఫ్ అపార్ట్‌ మెంట్​లోకి నిందితుడు ప్రవేశించాడని పోలీసులు పేర్కొన్నారు. సైఫ్‌ నివాసంలో దాడి చేసిన దుండగుడు తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. ఘటన అనంతరం బాంద్రా ప్రాంతంలోనే ఉన్న బస్ స్టాప్​లో ఉదయం 7గంటల వరకు పడుకున్నాడని వెల్లడించారు. అనంతరం రైలు ఎక్కి వర్లీ (ముంబయి సెంట్రల్‌)కి చేరుకున్నట్లు తెలిపారు.

అందుకే సైఫ్ పై దాడి
సైఫ్, ఆయన భార్య, పిల్లలు, సిబ్బంది ఉండే ఏడు, ఎనిమిదో అంతస్తు మెట్లు ఎక్కాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. దాడి జరగడానికి ముందు అర్ధరాత్రి దాటాక నిందితుడు సైఫ్‌ ఉంటున్న అపార్ట్‌ మెంట్​లోకి వెళ్లాడని వెల్లడించారు. 8 అంతస్తుల వరకు మెట్ల మార్గంలోనే వెళ్లాడని, తర్వాత డక్ట్‌ ఏరియాకు చేరుకొని పైపు పట్టుకొని 12వ అంతస్తుకు చేరుకున్నాడని తెలిపారు. అనంతరం బాత్​రూమ్​ కిటికీ తెరిచి సైఫ్‌ నివాసంలోకి ప్రవేశించాడని వెల్లడించారు. ఈ క్రమంలో పెనుగులాట జరిగి సైఫ్‌ పై దాడి జరిగిందని వివరించారు.

'రూ. కోటి ఇవ్వాలని నిందితుడు డిమాండ్'
"నిందితుడు రూ. కోటి ఇవ్వాలని ఆయాను కోరాడు. అయితే శబ్దాలు విన్న సైఫ్‌ వెంటనే అక్కడికి చేరుకొని ముందు నుంచి దుండగుడిని గట్టిగా పట్టుకున్నాడు. పెనుగులాటలో సైఫ్‌ వెన్నుపై నిందితుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే ప్రతిఘటించిన సైఫ్ దుండగుడిని ఫ్లాట్​లోనే ఉంచి బయట తలుపు వేసేశాడు. అయితే నిందితుడు తాను వచ్చిన మార్గం నుంచే బయటకు వెళ్లిపోయాడు. నిందితుడి బ్యాగ్​లో నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్‌, నైలాన్‌ తాడు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. అయితే దుండగుడికి తాను దాడి చేసిన వ్యక్తి సైఫ్‌ అలీఖాన్‌ అన్న విషయం తొలుత తెలియదు. టీవీల్లో, సోషల్‌ మీడియాలో చూసిన తర్వాతే సైఫ్​పై తాను దాడి చేశానని నిందితుడికి తెలిసింది" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

బంగ్లాదేశ్​కు చెందిన నిందితుడు
కాగా, నిందితుడు బంగ్లాదేశ్​లోని ఝలోకటి జిల్లాకు చెందినవాడిగా పోలీసులు తెలిపారు. గత ఐదు నెలలుగా ముంబయిలో ఉంటున్నాడని పేర్కొన్నారు. హౌస్‌ కీపింగ్‌ వంటి చిన్నచిన్న పనులు చేసినట్లు వివరించారు. నిందితుడు అక్రమంగా భారత్‌ లోకి ప్రవేశించాడని, ఆ తర్వాత విజయ్‌ దాస్​గా పేరు మార్చుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై భారతీయ న్యాయసంహిత సెక్షన్‌ 311 (హత్యాయత్నంతో కూడిన దోపిడీ), సెక్షన్‌ 331 (4) (ఇంటిపై దాడి), పాస్‌పోర్ట్‌ చట్టంలోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా భారత్​లోకి అక్రమంగా ప్రవేశించడంపై లోతుగా విచారణ చేపట్టినట్లు తెలిపారు.

నిందితుడికి 5రోజుల పోలీసు కస్టడీ
కాగా, నిందితుడిని బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా జనవరి 24వ తేదీ (5 రోజులు) వరకు పోలీసు కస్టడి విధించింది. ఈ కేసులో పోలీసులు వాదించిన అంతర్జాతీయ కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కాగా, తన క్లయింట్, అతడి కుటుంబం చాలా ఏళ్లుగా భారత్​లోని నివసిస్తోందని డిఫెన్స్ లాయర్ సందీప్ డీ షెర్ఖానే వాదించారు. దేశంలో నివసించడానికి కావాల్సిన కీలక పత్రాలు తన క్లయింట్ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.