Central Tribal University Admissions:కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. మొదట పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఏ ప్రకటన విడుదల చేసింది. కొద్ది రోజుల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన రానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సీయూఈటీ -25 (కేంద్రీయ విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష)లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సులు 16: 2022లో రెగ్యులర్ బోధకుల నియామకంతో అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ కలిపి 14 కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు. నూతన విద్యా సంవత్సరానికి గాను పీజీలో ఎంఏ ఆర్థికశాస్త్రం, భూగోళశాస్త్రం కొత్తగా ప్రవేశపెడుతున్నారు. దీంతో కోర్సుల సంఖ్య పీజీలో 10, డిగ్రీలో 6 పెరిగాయి.
బోధనలో పలు మార్పులు: నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా బోధనలో ఈ ఏడాది పలు మార్పులు తీసుకొచ్చారు. క్షేత్ర పర్యటన, ప్రయోగాత్మక బోధనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ ఆచార్యులు, అసోసియేట్ ఆచార్యులు, సహాయ ఆచార్యులతో కలిపి 18 మంది బోధకులు, బోధనేతర సిబ్బంది 12 మంది ఉన్నారు. వీటితో పాటు 77 బోధకులకు, 49 మంది బోధనేతర పోస్టులు మంజూరయ్యాయి.
కోర్సుల వివరాలిలా..
పీజీలో.. ఎమ్మెస్సీ రసాయనిక శాస్త్రం, బయోటెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), మాస్టర్ ఆఫ్ ట్రైబల్ స్టడీస్, మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్, మాస్టర్ ఆఫ్ సోషియాలజీ, మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎంఏ ఆర్థికశాస్త్రం, ఎంఏ భూగోళశాస్త్రం
అండర్ గ్రాడ్యుయేట్: బీఎస్సీ రసాయనికశాస్త్రం, వృక్షశాస్త్రం, భూ విజ్ఞానశాస్త్రం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బీకాం ఒకేషనల్, బీబీఏ (ట్రావెల్‌టూరిజం మేనేజ్‌మెంట్) పీజీకి 20, డిగ్రీకి 30 సీట్లు ఉంటాయి. జాతీయ రిజర్వేషన్ పాలసీకి అనుగుణంగా భర్తీ జరుగుతుంది. తక్కువ రుసుములతో గిరిజనులు, గిరిజనేతరులు చదువుకోవచ్చు. పీజీ కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణులు, తుది సంవత్సరం పరీక్షలు రాసేవారు సైతం దీనికి అర్హులు. అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించాలి.
YSR Statue: యూనివర్శిటీలో వైయస్ విగ్రహమా? వీసీని రీకాల్ చేయాలి.. విద్యార్థి సంఘాల డిమాండ్!
Vedic University: ఏళ్లు గడుస్తున్నా.. పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు