Old Couple came to Collectorate with Pesticide Can to Seek Justice: కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వృద్ధ దంపతులు పురుగుమందు డబ్బా తీసుకుని రావడం కలకలం రేపింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని పుట్టపర్తి కలెక్టరేట్‌కు నడిమిగడ్డపల్లెకు చెందిన వృద్ధ దంపతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఆ దంపతుల వద్ద పురుగు మందు డబ్బా బయటపడింది. దీంతో పోలీసులు వారి వివరాలు కనుక్కొని కలెక్టర్ వద్దకు పంపించారు.
ముక్తాపురంలో పెద్దన్న పేరిట 5 ఎకరాల భూమి ఉందని పెద్దన్న భార్య తెలిపారు. పెద్దన్న తమ్ముడు పుల్లన్న అక్రమంగా 2 ఎకరాల భూమిని అతని పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని చెప్పారు.
బండెనక బండి కట్టి ఐదు బండ్లు కట్టి - 125 జొన్న బస్తాలను లాగేసిన ఎద్దు
ఆరోజు చూసిన కన్నీటి గాథలు, ఇచ్చిన హామీలు నేటీకీ గుర్తున్నాయి: నారా లోకేశ్