Pushpa 2 USA Pre Booking : మూవీ లవర్స్‌ను ఎగ్జైట్మెంట్లో ముంచెత్తుతూ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంటున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప ది రూల్'. విడుదలకు కౌంట్‌డౌన్ మొదలవ్వడం వల్ల అభిమానుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఇప్పుడు ఎవరినోట విన్న ఎటు చూసినా పుష్ప పేరే వినిపిస్తోంది, కనిపిస్తోంది.
అయితే తాజాగా యూఎస్ ప్రీ బుకింగ్స్‌లో ఓ అరుదైన ఘనతను సాధించి ఓవర్సీస్లో పుష్ప మేనియా ఎలా ఉందో చూపించింది. ప్రస్తుతం అక్కడ ఏకంగా 1.25 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్‌ని టచ్ చేసి ఫాస్టెస్ట్ బుకింగ్స్ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. సుమారు 45 వేలకి పైగా టికెట్స్ అమ్ముడయ్యాయట. ఈ విషయాన్ని యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.
PUSHPA RAJ’S RULING⁰Leaving no stone unturned 🔥
— Prathyangira Cinemas (@PrathyangiraUS) November 23, 2024
Fastest $1,256,524+ Gross with 45,000+ tickets sold for USA Premieres 🪓💥
DECEMBER 4th – The wildfire rules ALL! ❤️🔥#Pushpa2TheRule #Pushpa2 #Pushpa2USA@AlluArjun #Sukumar @iamRashmika @MythriOfficial pic.twitter.com/T8Pu3aUOrY
ఒక్క గ్లింప్స్‌లో ఎన్నో సర్ప్రైజ్లు
గత ఆదివారం విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా ఇందులోని జాతర ఫైట్, మాస్ సీన్స్‌కు అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా కొన్ని ట్విస్ట్‌లు, మరికొన్ని కొత్త క్యారెక్టర్ల పరిచయంతో ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఈ క్రమంలో అన్ని భాషల్లోనూ మిలియన్స్‌కు పైగా వ్యూవ్స్‌తో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది ఈ ట్రైలర్.
ఇక 'పుష్ప 2' సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్‌గా మెరుస్తుండగా, మాలీవుడ్ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, సీనియర్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు చాట్బస్టర్లుగా నిలిచాయి. మరో పాట త్వరలోనే విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి శంకర్, నవీన్ ఈ సినిమాకు సంయుక్తంగా ప్రోడ్యూస్ చేస్తున్నారు.
'తొలి సారి వచ్చా ఇక్కడికి - అలా జరిగినందుకు కారణం మీరే' : అల్లు అర్జున్
'పుష్ప 2'కి నేనే కాదు, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేస్తున్నారు : తమన్