Vivo V50 Launched in India: వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. 'వివో V50' పేరుతో కంపెనీ దీన్ని ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లాంఛ్ చేసింది. కంపెనీ దీన్ని స్లిమ్ డిజైన్, పోర్ట్రెయిట్ పిక్చర్స్ కోసం ZEISS- బ్రాండెడ్ కెమెరాలతో తీసుకొచ్చింది. వివో నుంచి V- సిరీస్‌లో ఈ ఏడాది వచ్చిన మొదటి డివైజ్ ఇదే. అయితే కంపెనీ దీని ప్రో వేరియంట్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేయడం లేదు.
'వివో V50' స్మార్ట్‌ఫోన్ ఇటీవల నవంబర్ 2024లో చైనాలో రిలీజ్ అయిన 'వివో S20' రీబ్రాండెడ్ వెర్షన్. ఇప్పుడు దేశీయ మార్కెట్లోకి కంపెనీ దీన్ని ప్రీమియం డిజైన్ ఎలిమెంట్స్, అడ్వాన్స్డ్ కెమెరాలు, పర్సనల్ అసిస్టెన్స్ కోసం AI ఫీచర్లతో తీసుకొచ్చింది. దీంతో మిడ్ రేంజ్ కేటగిరీలో ఈ ఫోన్ ఉన్నత శ్రేణిలో ఉంటుందని కంపెనీ భావిస్తోంది. వీటితో పాటు వివో ఈ స్మార్ట్‌ఫోన్‌పై లాంఛ్ ఆఫర్స్‌ను కూడా ప్రకటించింది. ఈ సందర్భంగా దీని ధర, స్పెసిఫికేషన్లతో పాటు ఆఫర్ల వివరాలు కూడా తెలుసుకుందాం రండి.

స్మార్ట్ AI ఫీచర్లు: స్మార్ట్ AI ఫీచర్లతో కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. ఇందులో సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్, లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, AI ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్‌తో పాటు AI స్క్రీన్ ట్రాన్స్‌లేషన్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

వివో V50 స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: ఈ ఫోన్ 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ AMOLED స్కీన్‌తో ఫుల్ HD+ రిజల్యూషన్ (2392 x 1080 పిక్సెల్స్), 120Hz వరకు రిఫ్రెష్ రేట్, P3 వైడ్ కలర్ గాముట్ అండ్ 4,500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అంతేకాక వివో దీన్ని డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో తీసుకొచ్చింది. ఇది దీని ప్రీవియస్ షాట్ గ్లాస్ కంటే 50 శాతం ఎక్కువ డ్రాప్-రెసిస్టెంట్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ప్రాసెసర్: ప్రాసెసర్ కోసం కంపెనీ ఈ 'వివో V50' స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను అందించింది.
It's slim, it's sleek, and it's here to impress. Feel the power in your hands without feeling the weight with India's Slimmest Smartphone- the new vivo V50.
— vivo India (@Vivo_India) February 11, 2025
Launching on 17th February at 12 PM.
Know more. https://t.co/2MuujxysqG#vivoV50 #ZEISSPortraitSoPro pic.twitter.com/LOHmHpEur5
స్టోరేజీ: దీన్ని 12GB వరకు LPDDR4X RAM అండ్ 512GB వరకు UFS 2.2 స్టోరేజీని పెంచుకోవచ్చు.
ప్రొటెక్షన్: ఈ డివైజ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీతో IP68, IP69 రేటింగ్స్‌తో వచ్చింది.
కెమెరా సెటప్: ఈ ఫోన్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో 50MP ప్రైమరీ రియర్ సెన్సార్, AF (ఆటోఫోకస్)తో 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెండు లెన్స్‌లు 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. అంతేకాక ఈ ఫోన్లో AF అండ్ 92-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ తో కూడిన 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. సినిమాటిక్ బ్లర్‌తో పోర్ట్రెయిట్ షాట్లను క్యాప్చర్ చేసేందుకు, ఏడు క్లాసిక్ Zeiss-స్టైల్ బోకె ఎఫెక్ట్స్‌ను అందించేందుకు కంపెనీ ఈ మూడు కెమెరా లెన్స్‌లను ZEISS కంపెనీతో కలిసి ప్రత్యేకంగా రూపొందించింది.
బ్యాటరీ: వివో నుంచి వచ్చిన ఈ కొత్త V-సిరీస్ స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 90W ఫ్లాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ బ్యాటరీ కేటగిరీలో ఇండియాలో అత్యంత స్లిమ్ డిజైన్ స్మార్ట్‌ఫోన్ ఇదే అని కంపెనీ చెబుతోంది.
ఆపరేటింగ్ సిస్టమ్: ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్‌టచ్ OS 15పై రన్ అవుతుంది.
ఇతర ఫీచర్లు: ఇది బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.
కలర్ ఆప్షన్స్: ఈ స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్‌లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
- రోజ్ రెడ్
- స్టార్రి నైట్
- టైటానియం గ్రే
వివో V50 వేరియంట్స్: కంపెనీ దీన్ని మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది.
- 8GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 256GB స్టోరేజ్
- 12GB RAM + 512GB స్టోరేజ్
వివో V50 ధరలు:
- 'వివో V50' 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 34,999
- 'వివో V50' 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 36,999
- 'వివో V50' 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 40,999
లాంఛ్ ఆఫర్స్: కంపెనీ లాంఛ్ ఆఫర్లో భాగంగా 'వివో V50'తో పాటు 'వివో TWS 3e' ఇయర్ బడ్స్ డిస్కౌంట్‌తో రూ. 1,499లకే లభిస్తాయి. అంతేకాక ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై వివో 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లేదా 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. దీంతోపాటు ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై వినియోగదారులు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ బోనస్, ఆరు నెలల నో-కాస్ట్ EMIతో పాటు వన్ ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీని కూడా పొందగలరు.
It's slim, it's sleek, and it's here to impress. Feel the power in your hands without feeling the weight with India's Slimmest Smartphone- the new vivo V50.
— vivo India (@Vivo_India) February 11, 2025
Launching on 17th February at 12 PM.
Know more. https://t.co/2MuujxysqG#vivoV50 #ZEISSPortraitSoPro pic.twitter.com/LOHmHpEur5
సేల్స్: వివో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్స్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, భారతదేశంలో కంపెనీ అధికారిక ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఓపెన్ అయ్యాయి. అలాగే రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, బిగ్ సి, లాట్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వంటి మరిన్ని ఇతర ప్రధాన రిటైల్ స్ట్రోర్స్లో కూడా సేల్కు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫోన్ ఫిబ్రవరి 25, 2025 నుంచి కొనుగోలుకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ రివీల్!- కెమెరా మాడ్యూల్ ఎలా ఉందో తెలుసా?
వాట్సాప్‌లో భలే కొత్త ఫీచర్- ఇకపై మీ చాట్‌ను రంగులతో నింపేయొచ్చు- ఎలాగంటే?
గగన్‌యాన్‌తో మరో అద్భుతానికి ఇస్రో రెడీ!- ఈ ఏడాదే మొదటి ఫ్లైట్ లాంఛ్- షెడ్యూల్ ఇదే!