ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపండి : అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం - CM REVANTH REDDY ON ILLEGAL SAND

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం - అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని ఆదేశించిన సీఎం

Illegal Sand Transportation
CM Revanth Reddy On Illegal Sand Transportation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2025, 2:23 PM IST

CM Revanth Reddy On Illegal Sand Transportation : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఇసుక రీచ్‌లను తనిఖీలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను సీఎం మరోసారి ఆదేశించారు. ఓవర్‌లోడ్, అక్రమ రవాణపై విజిలెన్స్ దాడులు చేయాలని స్పష్టం చేశారు. ఇసుక అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఇసుక అక్రమ రవాణపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు.

ఇసుక బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణకు అడ్డుకట్ట వేసే బాధ్యత జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలకు హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రాకు అప్పగించారు. ఇసుక రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్ తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్​లు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇసుక అక్రమ రవాణ జోరుగా సాగుతున్నాయన్న ప్రచారంతో తాజాగా ముఖ్యమంత్రి ఇవాళ మరోసారి ఆదేశించారు.

గనులు ఖనిజాభివృద్ధిపై సమీక్ష : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో ఇసుక రవాణా, తవ్వకాల అంశంపై ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఈ నెల 10న గనులు ఖనిజాభివృద్ధిపై సమీక్షించిన సీఎం అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉంచాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇసుక మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపాలని, ఇసుక రీచ్‌ల వద్ద అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసే బాధ్యతను కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ - ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా!

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా ఎలా? - అధికారులతో చర్చించిన సీఎం రేవంత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.