AR Rahman Legal Notices : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ లీగల్ టీమ్ తాజాగా ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా తమకు తోచింది రాసినా, అలాగే యూట్యూబ్ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేసినా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అలా ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే వారిపై పరువు నష్టం దావా వేయమని రెహమాన్ సూచించినట్టు అందులో పేర్కొంది.
Notice to all slanderers from ARR's Legal Team. pic.twitter.com/Nq3Eq6Su2x
— A.R.Rahman (@arrahman) November 23, 2024
తాజాగా రెహమాన్ నుంచి విడిపోతున్నట్లు తన భార్య సైరా అధికారికంగా ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతోనే వారు విడిపోతున్నట్లు ఆమె తెలిపారు. అలానే ఈ దంపతుల తరఫున ప్రముఖ లాయర్ వందనా షా కూడా ఈ డివొర్స్ గురించి ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే అప్పుడు ఏఆర్ రెహమాన్ ఈ విషయం గురించి మాట్లాడారు.
"మా పెళ్లి బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని ఎంతో ఆనందించాము. కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. విరిగిన హృదయాలు దేవుడిని కూడా ప్రభావితం చేస్తాయి. పగిలిన ముక్కలు మళ్లీ ముందులా అతుక్కోలేవు. అయినా కూడా మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాం" అంటూ ట్విట్టర్ వేదికగా ఎమోషనలయ్యారు.
కాగా, 1995లో రెహమాన్ సైరా వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్యానికి 29 ఏళ్లు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఖతీజా, రహీమా, అమీన్ వీరి సంతానం. సైరాతో వివాహాన్ని తన తల్లి నిశ్చయించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ తెలిపారు. "సినిమాలకు సంగీతం అందిస్తూ చాలా బిజీగా ఉండేవాడిని. 29 ఏళ్ల వయసులో, పెళ్లి చేసుకుంటా, అమ్మాయిని చూడు అని అమ్మకు చెప్పాను" అంటూ గతంలో చెప్పుకొచ్చారని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
రెహమాన్ విడాకులతో లింక్ రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన మోహినిదే