బ్రిటన్లో మరో జార్జ్ ఫ్లాయిడ్.. మెడపై మోకాలు పెట్టి! - బ్రిటన్ పోలీసు
🎬 Watch Now: Feature Video

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని ప్రపంచం మర్చిపోకముందే.. బ్రిటన్లో అదే తరహా ఘటన మరొకటి జరిగింది. గురువారం ఉత్తర లండన్లో ఓ నల్లజాతీయుడిని పట్టుకున్నారు పోలీసులు. అతడికి సంకెళ్లు వేశారు. అ తర్వాత.. ఆ నల్లజాతీయుడి మెడపై మోకాలును బలంగా మోపాడు ఓ పోలీసు. అదే సమయంలో తన చేతిని ఆ నల్లజాతీయుడి తలపై పెట్టాడు. ఈ దృశ్యాలు స్థానిక కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో ఆధారంగా సంబంధిత పోలీసును అధికారులు సస్పెండ్ చేశారు. మరో పోలీసుపై ఆంక్షలు విధించారు.